LADY TEACHER CAUGHT BY POLICE WITH A GUN IN UTTAR PRADESH SNR
OMG: కాలేజీ అమ్మాయి నడుము దగ్గర ఏం దాచిపెట్టిందో ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు
Photo Credit:Youtube
OMG:భుజానికి బ్యాగ్ వేసుకుంది. పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. చూడటానికి కాలేజీ ఫిగర్‌లా ఉంది. అయితే పోలీసులకు తెలుసు కదా ఎవరు క్రిమినలో, స్టూడెంట్స్‌తో అందుకే యువతిని చెక్ చేయడంతో ఆమె నడుములో దాచుకున్న తుపాకీ బయటపడింది. అంతే పోలీసులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వాళ్లు షాక్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో గన్ కల్చర్ మరింత పెట్రోగిపోతోంది. నిన్న మొన్నటి వరకు స్మగ్లర్లు, గ్యాంగ్స్టర్లు, రౌడీషీటర్లు మాత్రమే ఉపయోగించే పిస్టోల్స్,కంట్రీమేడ్ గన్స్ ఇప్పుడు టీనేజర్స్, ఎంప్లాయిస్ కూడా ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మెయిన్పూర్ (Mainpuri)జిల్లాలో పోలీసులకు అనుమానం వచ్చి ఓ యువతిని తనిఖీ(Checking) చేశారు. చూడటానికి కాలేజీ (Collage)అమ్మాయిలా కనిపిస్తున్న యువతిని లేడీ పోలీస్ తనిఖీ చేసింది. యువతి భుజానికి బ్యాగ్ తగిలించుకున్నప్పటికి లేడీ పోలీస్ (Lady police) బాగా తెలిసినట్లుగా యువతి() ప్యాంట్ పాకెట్స్‌ని, నడుముని తనిఖీ చేసింది. యువతి నడుము ముట్టుకోనివ్వకపోవడంతో లేడీ కానిస్టేబుల్‌కి డౌట్ వచ్చి నడుము చుట్టూ చేయి పెట్టి వెదికింది. అందరూ చూస్తుండగా యువతి నడుములో సీక్రెట్‌గా దాచుకున్న ఓ కంట్రీమేడ్ తుపాకిని బయటకు తీసింది లేడి కానిస్టేబుల్. ఇప్పటి వరకు ఈ యువతిని ఎందుకు చెక్ చేస్తుందిరా బాబు అని అనుకున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఓ యువతి నడుములో గన్ని దాచుకోవడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చుట్టు పక్కల ఉన్న చాట్‌బండార్, టీ స్టాల్ దగ్గర నిల్చున్న వాళ్లు సైతం నివ్వెరపోయారు. తుపాకీతో పట్టుబడిన మహిళ ఓ లేటీ టీచర్(Lady teacher)గా పోలీసులు భావిస్తున్నారు. ఆమె పేరు, వివరాలు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. తుపాకీ ఎక్కడి నుంచి కొనుగోలు చేసిందో తెలిసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని యూపీ పోలీసులు తెలిపారు.
టీచర్ దగ్గర పిస్టోల్..
మెయిన్పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయింది. లేడీ పోలీస్ యువతిని తనిఖీ చేస్తుండగా అక్కడే ఉన్న కొందరు తమ సెల్ఫోన్లతో షూట్ చేశారు. పక్కనే ఉన్న పోలీసు సిబ్బంది కూడా వీడియో తీసారు. తుపాకీతో అమ్మాయి పట్టుబడటంతో వెంటనే వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో విపరీతంగా వైరల్ అవుతోంది. తుపాకీతో పట్టుబడిన ఓ టీచర్ అని సమాచారం. వెంటనే పిస్టోల్ని స్వాధీనం చేసుకొని యువతిని జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పిస్టోల్‌తో దొరికిపోయిన యువతి కూడా నిర్భయంగా పోలీసు జీప్ ఎక్కి కూర్చుంది.
తుపాకీతో ఏం పని..
ఉత్తరప్రదేశ్‌లో అసాంఘీకశక్తులను ఏరిపారేసేందుకు యోగీ సర్కారు యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఆ శాఖ పోలీసులు అడుగడుగున తనిఖీలు చేస్తుండటతో ఇలాంటి వ్యక్తులు, పర్మిషన్ లేకుండా ఆయుధాలను వాడుతున్న వాళ్లు బయటపడుతున్నారు. తుపాకీతో పట్టుబడిన టీచర్‌కి అంత కాస్ట్లీ తుపాకి ఎక్కడి నుంచి వచ్చింది..ఎవరి దగ్గర కొనుగోలు చేసిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.