చండీగఢ్: ఆమె ఒక స్కూల్ టీచర్. వయసు 34 ఏళ్లు. అలాంటి టీచర్ 15 ఏళ్ల వయసున్న విద్యార్థులకు చదువు మాత్రమే చెబుతుందని ఎవరైనా అనుకుంటారు. ఆమె దగ్గరకు స్టూడెంట్స్‌ను పంపించే తల్లిదండ్రులు కూడా అదే అనుకున్నారు. కానీ వాళ్లకు మాత్రం ఏం తెలుసు.. ఆమె ఓ స్టూడెంట్‌పై కన్నేసి తమ కామవాంఛను తీర్చుకుంటుందని. ఎవరూ ఊహించని విధంగా వ్యవహరించిన ఈ స్కూల్ టీచర్ వ్యవహారం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల క్రితం చండీగఢ్ సమపంలోని రామ్ దర్బార్ ప్రాంతంలో ఓ మహిళ టీచర్ విద్యార్థులకు ట్యూషన్ చెబుతూ ఉండేది. ఆమె చదువు బాగా చెబుతుందనే టాక్ ఉండటంతో.. చాలామంది ఆమె దగ్గరకు తమ పిల్లలను పంపడం మొదలుపెట్టారు. అలా 14 ఏళ్ల తమ కుమారుడితో పాటు అతడి కంటే చిన్న వయసులో ఉన్న తమ కూతురిని ఆ టీచర్ దగ్గరకు ట్యూషన్‌కు పంపించారు ఆ తల్లిదండ్రులు.
కొద్దిరోజుల పాటు ఆ అన్నాచెల్లెలు ఇద్దరు కలిసి ట్యూషన్‌కు వెళ్లారు. కానీ ఓ రోజు సడెన్‌గా స్కూల్ టీచర్ ఆ అబ్బాయి చెల్లెలిని ట్యూషన్ నుంచి తొలగించింది. ఇలా ఎందుకు చేశారని తల్లిదండ్రులు స్కూట్ టీచర్‌ను ప్రశ్నించారు. అయితే ఆమె వల్ల అబ్బాయి చదువు సరిగ్గా సాగడం లేదని ఆమె సమాధానం చెప్పింది. ఆ విషయాన్ని వాళ్లు కూడా నమ్మేశారు. అయితే తమ కుమారుడిపై ఆ స్కూల్ టీచర్ లైంగికంగా దాడి చేస్తోందనే విషయం వారికి అప్పుడు తెలియలేదు. కొంతకాలం పాటు ఫోన్లో తమ కుమారుడితో స్కూల్ టీచర్ ఛాటింగ్ చేసేది. రాత్రి సమయంలోనూ ఇది కొనసాగేది.
అయితే ఇదంతా చదువు కోసమే అని వాళ్లు అనుకున్నారు. అయితే ఆ ఛాటింగ్ అసభ్యకరమైందనే విషయం తల్లిదండ్రులకు ఓ రోజు తెలిసొచ్చింది. అంతేకాదు తనతో రావాలని స్కూల్ టీచర్ చేసిన ప్రతిపాదనను విద్యార్థి తిరస్కరించడంతో.. అతడికి ఓ విషపూరితమైన పదార్థాన్ని ఇచ్చింది ఆ మహిళా స్కూల్ టీచర్. దీంతో కొన్ని నెలల నుంచి స్కూల్ టీచర్ తనపై లైంగిక దాడి చేస్తున్న విషయాన్ని అతడు తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చాడు.
వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు విద్యార్థి తల్లిదండ్రులు. దీంతో మూడేళ్ల క్రితం ఆ మహిళా టీచర్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమె విద్యార్థిని లైంగికంగా లొంగదీసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో అతడిని శారీరకంగా ఇబ్బంది పెట్టినట్టు నిర్ధారించారు. మూడేళ్ల పాటు కోర్టులో ఈ కేసు విచారణ సాగింది. నేరం రుజువుకావడంతో కోర్టు ఆ స్కూల్ టీచర్‌కు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాదు కోర్టు ఆమెకు రూ. 10000 జరిమానా విధించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.