కానిస్టేబుల్‌తో లేడీ ఎస్సై వివాహేతర సంబంధం... తనకు న్యాయం చేయాలంటున్న పోలీస్ భార్య

ప్రతీకాత్మక చిత్రం (image from youtube)

Extramarital Affair: వివాహేతర సంబంధాలు ఎప్పుడూ విషాదాంతాలే... ఈ విషయం తెలిసి కూడా ఆ లేడీ ఎస్సై ఎందుకీ లవ్ ఎఫైర్ నడుపుతున్నారు? ఇదంతా ఎలా జరుగుతోంది?

 • Share this:
  Illicit Affair in Nellore: వివాహేతర సంబంధాలు పెట్టుకున్న కేసులు పోలీస్ స్టేషన్‌కి వస్తే... పోలీసులు... అలాంటివి వద్దంటూ... రెండు వైపులా కౌన్సెలింగ్ చేస్తారు. అలాంటిది ఓ మహిళా ఎస్సై అలాంటి పని చేస్తే... ఎవరికి చెప్పుకోవాలి? ఆంధ్రప్రదేశ్... నెల్లూరు జిల్లాలో ఈ వ్యవహారం నడుస్తోంది. ఆత్మకూరు డివిజన్ పరిధిలో... పనిచేసినప్పుడు ఓ లేడీ ఎస్సై... కానిస్టేబుల్ పెంచల సాయితో ప్రేమాయణం నడిపింది. అతనికి ఆల్రెడీ పెళ్లైంది. కానీ... లవ్ ఎఫైర్ నడుపుతున్నది తన పై అధికారి అయిన లేడీ ఎస్సై కావడంతో... పెంచల సాయి ఆమెను ఆపలేకపోయాడు. క్రమంగా ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది కాస్తా ఓ రోజు... సాయి భార్యకు తెలిసింది. ఆమెకు గుండె ఆగినంత పనైంది... తనకు అన్యాయం చేయవద్దని భర్తను వేడుకుంది. పెంచల సాయి తన పరిస్థితి చెప్పాడు. తాను నిస్సహాయుణ్ని అన్నాడు.

  తన కాపురం కల్లలవుతుండటంతో... ఎలాగైనా ఈ తంతుకు బ్రేక్ వెయ్యాలనుకున్న బాధితురాలు... సాయిది కలువాయి మండలం కావడంతో... కలువాయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అంతర్గత ఎంక్వైరీ చేయగా... ఆమె ఆరోపణ నిజమేనని తేలింది. దాంతో... దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆ లేడీ ఎస్సైని... వీఆర్‌కి పంపించారు. ఇక ఏ సమస్యా ఉండదని బాధితురాలికి ధైర్యం చెప్పారు.

  డ్యూటీ ప్లేస్ మారినా... లవ్ ట్రాక్ మాత్రం మారలేదు. ఆ మహిళా ఎస్సై... సాయిని వదల్లేదు. వివాహేతర సంబంధం కొనసాగించసాగింది. ఇదెక్కడి తంతురా దేవుడా అనుకుంటూ... బాధితురాలు... ఈసారి ఎస్పీ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. దాంతో ఆ ఎస్పీ... ఆమెకు కాల్ చేసి... ఇలాంటివి మానేయమని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఐతే... తన పైనే ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చిందనే కోపంతో... ఆ లేడీ ఎస్సై... కానిస్టేబుల్ సాయి ఇంటికి వెళ్లి అతని భార్యను నిలదీసింది. పెద్ద గొడవైంది.

  ఇది కూడా చదవండి:Horoscope Today: డిసెంబర్ 19 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఖర్చులు పెరిగే సమయం

  "ఓర్నాయనో... ఇలాగైతే ఎలా... ఈమె నుంచి నా భర్తను ఎలాగైనా కాపాడుకోవాలి" అనుకున్న బాధితురాలు... ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే... ఈ విషయం మీడియాకు తెలిసింది. దాంతో లేడీ ఎస్సై తెరమరుగు అయ్యింది. మరి ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తుందా... లేక ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడుతుందా అన్నది తేలాల్సి ఉంది. పోలీస్ ఉన్నతాధికారులే తనకు న్యాయం చెయ్యాలని, తన భర్తను కాపాడాలని వేడుకుంటోంది. ప్రస్తుతం ఈ ట్రయాంగిల్ స్టోరీ... జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.
  Published by:Krishna Kumar N
  First published: