అత్యాచారం కేసులో రూ.35 లక్షల లంచం.. ఈ లేడీ పోలీస్ మహా ముదురు

ఓ మధ్యవర్తి ద్వారా భావేష్ రూ.20లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని డబ్బులు ముట్టజెప్పాడు. ఐతే కొద్ది రోజుల తర్వాత మరో రూ.15లక్షలు ఇవ్వాలని ఎస్‌ఐ శ్వేత డిమాండ్ చేసింది. లేదంటే కేసులో ఇరికిస్తానంటూ బెదిరించింది.

news18-telugu
Updated: July 6, 2020, 5:40 PM IST
అత్యాచారం కేసులో రూ.35 లక్షల లంచం.. ఈ లేడీ పోలీస్ మహా ముదురు
అరెస్టైన లేడీ ఎస్ఐ
  • Share this:
అత్యాచారం కేసులో బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు.. తప్పుడు దారిలో వెళ్లింది. మహిళా పోలీస్ అయిఉండి కూడా.. సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా.. అవినీతికి పాల్పడింది. అత్యాచార నిందితుడితో డీల్ కుదుర్చుకొని.. కేసును మూసివేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అడ్డంగా బుక్కయింది. అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం తీసుకున్నారనే అభియోగంపై ఓ మహిళా ఎస్‌ఐను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్‌ కంపెనీ పనిచేసే ఇద్దరు మహిళలు తమపై కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెనాల్‌ షా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు 2019లో కేసు నమోదయింది. ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల ఈ కేసు విచారణను అహ్మదాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్వేతా జడేజాకు అప్పగించారు. ఐతే బాధితులకు అండగా నిలవాల్సిన ఆమె.. నిందితుడిని బ్లాక్ మెయిల్ చేశారు.

నిందితుడు కెనాల్ షా నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అతడి సోదరుడు భావేష్‌కి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ మధ్యవర్తి ద్వారా భావేష్ రూ.20లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని డబ్బులు ముట్టజెప్పాడు. ఐతే కొద్ది రోజుల తర్వాత మరో రూ.15లక్షలు ఇవ్వాలని ఎస్‌ఐ శ్వేత డిమాండ్ చేసింది. లేదంటే కేసులో ఇరికిస్తానంటూ బెదిరించింది. దాంతో దిక్కుతోచని స్థితిలో నిందితులు సిటీ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరిలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. విచారణ చేసి ఇటీవలే శ్వేతను అరెస్ట్ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 6, 2020, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading