Home /News /crime /

Lady Police: వామ్మో.. ఈ లేడీ పోలీస్ మహా జాదూ.. 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏం చేసిందో తెలుసా..

Lady Police: వామ్మో.. ఈ లేడీ పోలీస్ మహా జాదూ.. 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏం చేసిందో తెలుసా..

లేడీ పోలీస్ సీమా (ఫైల్ ఫోటో)

లేడీ పోలీస్ సీమా (ఫైల్ ఫోటో)

వాట్సాప్‌కు కాల్ చేయడం ద్వారా లేడీ పోలీస్ ఈ డీల్ మొత్తం చేసినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం తేలింది.

    పోలీసులు అవినీతికి పాల్పడి దొరికిపోయిన సంరద్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ విషయంలో మహిళా పోలీసులు పురుషులతో పోలిస్తే అవినీతికి దూరంగా ఉంటారనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఓ లేడీ పోలీస్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. రాజస్థాన్‌లోని బార్లుట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా ఎస్‌హెచ్‌ఓ సీమా జఖర్ స్మగ్లర్లతో కుమ్మక్కైంది. ఈ విషయం బయటపడటంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. వాట్సాప్ (Whatsapp)  కాల్ ద్వారానే లేడీ పోలీస్ ఈ డీల్‌ మొత్తం చేసిందని పోలీసులు(Police) నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన సీమ జాఖర్... స్పాట్‌కు వెళ్లిన తరువాత భిన్నంగా వ్యవహరించింది. దొంగలను పట్టుకోకుండా దొరికిన స్మగ్లర్‌తో (Smuggler)  రాజీ కుదుర్చుకుంది. అతడిని విడిచిపెట్టేందుకు తో ఏకంగా రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది.

    వాట్సాప్‌కు కాల్ చేయడం ద్వారా లేడీ పోలీస్ ఈ డీల్ మొత్తం చేసినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం తేలింది. స్మగ్లర్లు తప్పించుకునేందుకు వారితో ఒప్పందం కుదుర్చుకున్న లేడీ పోలీస్ సీమా.. అనంతరం తన వ్యక్తిగత వాహనంలో స్మగ్లర్లు తప్పించుకోవడానికి కూడా సహకరించింది. అయితే అవినీతికి పాల్పడిన సస్పెన్షన్‌కు గురైన సీమా జఖర్.. త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుండటం మరో విశేషం.

    నవంబర్ 28న ఎస్‌హెచ్‌ఓ సీమ పెళ్లి కూడా చేసుకోనుంది. ఆమె పెళ్లికి ముందే ఆమె పాల్పడిన ఈ అవినీతి భాగోతం బయటపడటంతో.. జిల్లా ఎస్పీ ధర్మేంద్ర సింగ్ ఆమెను సస్పెండ్ చేశారు. ఈ కేసులో సీమా జఖర్‌తో పాటు మరో ముగ్గురు పోలీసుల పాత్ర కూడా ఉందని ఉన్నతాధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో వాళ్లపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఈ వ్యవహారం బయటపడకుండా సీమా చాలా జాగ్రత్త పడింది. ఓ హోటల్‌లో ఆమె ఈ డీల్ కుదుర్చుకుంది.

    Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

    K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

    జలోర్ జిల్లాలోని సంచోర్ ప్రాంతంలోని ఓ గ్రామ సర్పంచ్ ద్వారా పోలీసులకు పది లక్షల రూపాయలు పంపించాడు ఒప్పందం కుదుర్చుకున్న స్మగ్లర్. అయితే పోలీసులకు, స్మగ్లర్‌కు మధ్య జరిగిన ఈ బేరం మొత్తం హోటల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అదే సమయంలో బస్సులో కూర్చున్న స్మగ్లర్ పారిపోతున్న సీసీటీవీ ఫుటేజీ కూడా తెరపైకి వచ్చింది.ఈ మొత్తం ఘటన గురించి తెలుసుకున్న పోలీసు సూపరింటెండెంట్ ధర్మేంద్ర సింగ్ యాదవ్ వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎస్పీ యాదవ్ స్వయంగా బార్లూట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీతో సహా ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీమా సహా ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు