• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • LADY KIDNAPPED IN VIKARABAD CALL TO POLICEMEN SAYS WILL APPEAR WITH HER HUSBAND AK

Vikarabad Kidnap Case: కిడ్నాప్‌కు గురైన యువతి.. పోలీసులకు ఫోన్ చేసి..

Vikarabad Kidnap Case: కిడ్నాప్‌కు గురైన యువతి.. పోలీసులకు ఫోన్ చేసి..

ప్రతీకాత్మక చిత్రం

Kidnap Case: తన విడాకుల కేసు నిమిత్తం దీపిక వికారాబాద్‌ కోర్టుకి హాజరైన రోజే దీపికను కారులో ఎత్తుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

  • Share this:
    వికారాబాద్‌లో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న దీపిక షాపింగ్‌కి వెళ్లొస్తూ కిడ్నాప్‌కి గురికావడం కలకలం రేపింది. ఆమె కిడ్నాప్‌ మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇందుకోసం మొత్తం ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇంతలోనే దీపిక ఓ ఎస్ఐ స్థాయి అధికారికి ఫోన్ చేయడంతో ఈ కేసు మిస్టరీ వీడిపోయింది. తాను ఇష్ట పూర్వకంగానే తన భర్త అఖిల్‌తో వెళ్లిపోయానంటూ ఆమె ఓ ఓ అధికారికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. వికారాబాద్ పోలీసులకి ఫోన్ చేసి తాను తన భర్త వద్ద క్షేమంగానే ఉన్నానని ఆమె చెప్పినట్టు సమాచారం.

    అయితే పోలీసులు మాత్రం ఈ కేసును పూర్తిగా ఓ కొలిక్కి తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. అందుకే దీపికతో పాటు ఆమె భర్తను ఓసారి పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు. దీంతో వారు కాసేపట్లో అక్కడికి రానున్నారు. నాలుగేళ్ల కిందట 2016లో దీపిక, అఖిల్‌లు మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు రెండేళ్ల కిందట యువతిని ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది.

    ఈ కేసు గురించి దీపిక వికారాబాద్‌ కోర్టుకి హాజరైన రోజే దీపికను కారులో ఎత్తుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆమెను కారులో తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే తన కోసం అన్వేషించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు దీపిక స్వయంగా సమాచారం ఇవ్వడంతో కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టయ్యింది.
    Published by:Kishore Akkaladevi
    First published: