చిత్తూరులో విషాదం.. ప్రేమికుల రోజే ప్రేమ కోసం యువతి ఆత్మహత్య

తన ప్రియుడిని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకొని జీవించలేనని స్వాతి నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తన ప్రియుడిని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకొని జీవించలేనని స్వాతి నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. తమ భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రేమ జంటలు పండగ చేసుకుంటున్నాయి. ఇలా యువతీ యువకులు ప్రేమలోకంలో మునిగిపోతే.. చిత్తూరులో ఓ ప్రేమికురాలు మాత్రం ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ కోసం ప్రేమికుల రోజే ప్రాణాలు తీసుకుంది. కుప్ప పరిధిలోని తంబిగానిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతి అనే యువతి ఓ యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత నచ్చజెప్పినా స్వాతి తల్లిదండ్రులు వినకపోవడంతో.. ఆహె తీవ్ర మనస్థాపానికి గురయింది. తన ప్రియుడిని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకొని జీవించలేనని స్వాతి నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాంతో స్వాతి కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: