ప్రియుడిపై అలిగి యువతి ఆత్మహత్య... ట్విస్ట్ ఏమిటంటే...

తన ప్రియుడు తాను చెప్పిన సమయానికి ఇంటికి రాకపోవడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది.

news18-telugu
Updated: May 2, 2020, 3:46 PM IST
ప్రియుడిపై అలిగి యువతి ఆత్మహత్య... ట్విస్ట్ ఏమిటంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రియుడిపై అలిగిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే... చనిపోయిన యువతి, ఆమె ప్రేమించిన యువకుడు ఇద్దరు పోలీసులే. వివరాల్లోకి వెళితే... విల్లుపురానికి చెందిన శివ కుమార్తె శరణ్య రైల్వే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ పెరంబూరు రైల్వే క్వార్టర్స్‌లో ఉంటోంది. ఆమెకు సాయుధ బలగాల విభాగంలో పనిచేస్తున్న ఏలుమలైతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గురువారం ఏలుమలై బర్త్‌డే కావడంతో శరణ్య విధుల్నిత్వరగా ముగించుకుని ప్రియుడి‌ బర్త్‌డే వేడుకలకు సిద్ధం చేసింది. సాయంత్రం ఆరు గంటల్లోపు క్వార్టర్స్‌కు రావాలని ఏలుమలైకు ఆమె సూచించింది. అయితే ఏలుమలైకుపేదలకు ఆహారం అందించే ప్రాంతాల్లో భద్రతా విధులు కేటాయించారు.

దీంతో శరణ్య చెప్పిన సమయానికి వెళ్లకపోవడంతో విషయం వివరించడానికి రాత్రి తొమ్మిది గంటల సమయంలో శరణ్యకు ఫోన్‌ చేయగా ఆమె స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించక పోవడంతో అదే క్వార్టర్స్‌లో ఉన్న ఆమె మిత్రురాలు రాజేశ్వరికి సమాచారం ఇచ్చాడు. తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆమె వెళ్లి చూడగా శరణ్య అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతుండడంతో ఓట్టేరి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రియుడిపై అలిగి ఆత్మహత్య చేసుకుందా లేక మరేదైనా కారణాలతో బలవన్మరణానికి పాల్పడిందా అని విచారణ చేపట్టారు.

First published: May 2, 2020, 3:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading