LADY ARREST WHO MURDERED HER HUSBAND ALONG WITH HER LOVER INCIDENT HAPPEND IN KARNATAKA SSR
Auto Driver: అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆటో డ్రైవర్ జీవితంలో అల్లకల్లోలం.. అసలేం జరిగిందంటే..
రంజిత, కార్తీక్ (ఫైల్ ఫొటో)
వివాహేతర సంబంధాల మోజులో పడుతున్న కొందరు బంధాలకు విలువనివ్వడం మానేస్తున్నారు. కట్టుకున్న భర్తను కడతేరుస్తున్నారు. నమ్మి ఇంటికి తీసుకెళ్లిన స్నేహితుడికే వెన్నుపోటు పొడుస్తున్నారు. కర్ణాటకలోని కెంపగౌడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
బెంగళూరు: వివాహేతర సంబంధాల మోజులో పడుతున్న కొందరు బంధాలకు విలువనివ్వడం మానేస్తున్నారు. కట్టుకున్న భర్తను కడతేరుస్తున్నారు. నమ్మి ఇంటికి తీసుకెళ్లిన స్నేహితుడికే వెన్నుపోటు పొడుస్తున్నారు. కర్ణాటకలోని కెంపగౌడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. తన భర్త కనిపించడం లేదంటూ కెంపగౌడ పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులకు ఆ యువతి వైఖరిపై అనుమానమొచ్చింది. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అనుమానం రాకుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసినట్లు ఆమె పోలీసుల విచారణలో అసలు నిజం ఒప్పుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్, రంజిత భార్యాభర్తలు. కొన్నేళ్ల క్రితం పెద్దలు వీరికి పెళ్లి కుదిర్చారు.
ఆటో డ్రైవర్‌గా వచ్చిన సంపాదనతో భార్యను సుఖంగా చూసుకుంటున్న కార్తీక్ తన స్నేహితుడు సంజీవ్‌ను నమ్మడమే తప్పైపోయింది. కార్తీక్‌కు కొన్నేళ్ల నుంచి సంజీవ్ తెలుసు. ఆ స్నేహంతోనే సంజీవ్‌ను కార్తీక్ ఒకసారి ఇంటికి తీసుకెళ్లాడు. తన స్నేహితుడని సంజీవ్‌ను రంజితకు పరిచయం చేశాడు. ‘మీ చెల్లి బావా’ అంటూ రంజితను సంజీవ్‌కు పరిచయం చేశాడు. కానీ.. కార్తీక్ పెట్టుకున్న నమ్మకాన్ని తన భార్య, స్నేహితుడు ఇద్దరూ వమ్ము చేశారు.
నిందితుడు సంజీవ్
అన్నాచెల్లిలా ఉండాల్సిన వాళ్లు వావివరుసలు మరిచి ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్తా చనువుగా మారింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. కార్తీక్ ఆటో డ్రైవింగ్‌కు వెళ్లగానే రంజిత సంజీవ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఇద్దరూ కలిసి ఇలా కార్తీక్ కళ్లుగప్పి పలుమార్లు కలిశారు. సంజీవ్‌కు సొంత ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటికి కూడా రంజిత వెళ్లేది. ఇలా వీళ్లిద్దరి వ్యవహారం సాగుతుండగా.. భర్తకు తెలిస్తే ఇబ్బందులు తప్పవని రంజిత భావించింది. ఈ విషయాన్ని తన ప్రియుడు సంజీవ్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి కార్తీక్ అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేశారు. కార్తీక్‌ను హత్య చేసేందుకు సంజీవ్ మరో స్నేహితుడి సాయం తీసుకున్నాడు.
కార్తీక్‌ను పార్టీ పేరుతో పిలిచి అతను పూటుగా మద్యం తాగాక మత్తులో ఉన్న అతనిపై దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత.. కార్తీక్ మృతదేహాన్ని వృషభవతి నదిలో పడేశారు. కార్తీక్‌ను చంపేశాక.. సంజీవ్ తన ప్రియురాలు రంజితకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కార్తీక్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయమని చెప్పాడు. ఆమె చెప్పినట్టే చేసింది. అయితే.. పోలీసులు సంజీవ్, రంజిత కుట్రను బట్టబయలు చేశారు. రంజిత, సంజీవ్, అతని స్నేహితుడు సుబ్రమణ్య కలిసి కార్తీక్‌ను చంపినట్లు తేల్చారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రియుడి మోజులో పడి భర్తను దూరం చేసుకున్న రంజిత ప్రస్తుతం జైలులో ఖైదీగా మిగిలింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.