కర్నూలు భర్త నిర్వాకం.. స్నేహితులతో సెక్స్ చేయాలంటూ..

ప్రతీకాత్మక చిత్రం

తన స్నేహితులతో సెక్స్ చేయాలంటూ ఓ భర్త తన భార్య మీద ఒత్తిడి తెచ్చాడు. గత కొన్ని రోజులుగా ఆమెను వేధింపులకు గురిచేశాడు.

  • Share this:
    తన స్నేహితులతో సెక్స్ చేయాలంటూ ఓ భర్త తన భార్య మీద ఒత్తిడి తెచ్చాడు. గత కొన్ని రోజులుగా ఆమెను వేధింపులకు గురిచేశాడు. భర్త వేధింపులను తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. కర్నూలుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజుకు , లలిత అనే మహిళతో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. బెంగళూరులో కాపురం ఉంటున్నారు. తొలి రెండు, మూడేళ్లు సంసారం బాగానే సాగింది. అయితే, ఆమెకు పిల్లలు కలగకపోవడంతో భర్త, అత్త నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. యేటికేడాది అవి పెరుగుతూ పోయాయి. దీనిపై గతంలో బెంగళూరులోని దేవనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్త, అత్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అప్పటి నుంచి పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటే, మరింత దిగజారింది. వేధింపులు బాగా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా భర్త తన స్నేహితులను ఇంటికి తీసుకుని రావడం మొదలు పెట్టాడు. వారితో సెక్స్ చేయాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. కుదరదని చెప్పినందుకు ఆమెను తిడుతూ, కొడుతూ ఇంట్లో నంచి కూడా గెంటేసినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం తాను కుట్టుమిషన్ కుట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్టు తెలిపింది. నిందితుడు నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
    First published: