ఎమ్మెల్యే కుల్దీప్ సింగే దోషి.. ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు

unnao rape case: ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన బాధితురాలిని ఈమధ్యే ఇంటికి తరలించి సీఆర్‌పీఎఫ్​సెక్యూరిటీ కల్పించారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చెయ్యగా... ఆగస్ట్ 5 నుంచీ ఢిల్లీ కోర్టు రహస్య విచారణ జరిపింది.

news18-telugu
Updated: December 16, 2019, 3:54 PM IST
ఎమ్మెల్యే కుల్దీప్ సింగే దోషి.. ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు
దోషి కుల్దీప్ సెంగార్(File Photo)
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలన రేపిన ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రెండేళ్ల కింద మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే కుల్దీప్ సెనెగర్‌ను కోర్టు దోషిగా తేల్చింది. బాధితురాలిని కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు నిర్ధారించింది. రేపు ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది ఢిల్లీ కోర్టు. ఈ కేసులో జడ్జి ధర్మేష్ జడ్జి ఆగస్టు 5 నుంచి రోజు వారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
2017లో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్ సెంగార్‌ ఓ బాలికను కిడ్నాప్‌ చేయించినట్లు ఆరోపణలొచ్చాయి. మరో నిందితుడు శశిసింగ్‌ ఈ కిడ్నాప్ చేసినట్లు అభియోగాలున్నాయి. 2019 ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదవ్వడంతో బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నేరపూరిత కుట్ర, కిడ్నాప్‌, పెళ్లికి బలవంత పెట్టడం, రేప్ సెక్షన్లతోపాటూ... పోక్సో కింద కూడా ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి.

ఇక అభియోగాల నమోదుకు పది రోజుల ముందు ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడగా... బాధితురాలి బంధువులు మరణించారు. బాధితురాలి తండ్రిపై యూపీలో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే మరో కేసు నమోదయ్యాయి. ఆయన్ను అరెస్టు చెయ్యగా... జైలులోనే చనిపోయారు.

దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో... 2019 ఆగస్టు ఒకటిన ఈ కేసును సుప్రీంకోర్టు... లక్నో బెంచ్ నుంచీ ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన బాధితురాలిని ఈమధ్యే ఇంటికి తరలించి సీఆర్‌పీఎఫ్​సెక్యూరిటీ కల్పించారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చెయ్యగా... ఆగస్ట్ 5 నుంచీ ఢిల్లీ కోర్టు రహస్య విచారణ జరిపింది. ఇన్ని మలుపులు తిరిగిన ఈ కేసుపై ఇవాళ ఢిల్లీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ సంచలన తీర్పు వెలువరించారు.

First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు