• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • KUKATPALLY POLICE CAUGHT HONEY TRAP ROB MEN GANG AT HYDERABAD VB

Hyderabad: అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. మాయమాటలు చెప్పి రూంకి వెళ్లేందుకు ఒప్పించింది.. ఆ తర్వాత జరిగింది అసలు కథ.. ఎంటో చదవండి

Hyderabad: అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. మాయమాటలు చెప్పి రూంకి వెళ్లేందుకు ఒప్పించింది.. ఆ తర్వాత జరిగింది అసలు కథ.. ఎంటో చదవండి

ప్రతీకాత్మక చిత్రం

అందమైన అమ్మాయిలతో యువకులను ఆకర్షిస్తారు. రూం కి రమ్మని మాయమాటలు చెప్పి వచ్చేదాకా ఒప్పిస్తారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత భయటపడతుంది ఆ అమ్మాయి వ్యవహారం. అక్కడ తన మూఠా సభ్యులను పిలిపించి దారుణంగా కొట్టి సొమ్ముతో ఉడాయిస్తారు. ఇలాంటి ముఠాను కేపీహెచ్ బీ పోలీసులు అరెస్టు చేశారు.

  • Share this:
    ఆఫీస్ పని మీదనో లేదా మరేదేమైన పని మీద టూ వీలర్ పై భయటకు వెళ్తుంటే అందమైన అమ్మాయి కంటపడి చెయ్యితో లిఫ్ట్ అడిగిందా.. సరే అమ్మాయి కదా అని మీరు ఆమెను ఎక్కించుకొని వెళ్తున్నారా అయితే మీ పని అయిపోయినట్లే.. మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లు గమనించండి. ఇలాగే గుర్తు తెలియని అమ్మాయిలను యువకులకు ఎరగా వేసి నిలువు దోపిడి చేస్తున్నారు దుండగులు. అలాంటి ఘటనే కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వద్ద చోటు చేసుకుంది. ఈ వివరాలు ఇలా.. యువతులను ఎరగా వేసి.. యువకులను ఆకర్షించి దోపిడీలకు పాల్పడుతున్న 14 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 13 సెల్‌ ఫోన్లు, ఒక కత్తి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ వారసిగూడ ప్రాంతానికి చెందిన గంధం విశాల్, రామంతాపూర్‌కు చెందిన భాజిని నవీన్, రాము, ఉప్పల్‌ గణేశ్‌నగర్‌కు చెందిన శైలజ, చెరుకూరి స్వాతి, వికాస్, సికింద్రాబాద్‌ చిలకలగూడకు చెందిన గుండె నవీన్, బీరం మధు, సాయి, డబ్బా నవీన్, ఇర్ఫాన్, సయ్యద్‌ మరియ, జమిలి శివకుమార్, దుర్గలు ఓ ముఠాగా ఏర్పడ్డారు.

    వీరు ముఠాలోని యువతులను యువకులపైకి ఎరవేసి ఆకర్షిస్తారు. అంటే లిఫ్ట్ అడగడమో లేదా ఫోన్ నంబర్ సాధించి మంచిగా మాట్లాడినట్లు నటించడమో చేసి ఎదో ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ బండారమంతా ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయటపడింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న నవీన్ కు ఇలానే జరగడంతో అతడు పోలీసులను ఆశ్రయించి తనపై పలువురు దాడికి పాల్పడి గాయపర్చారంటూ కేపీహెచ్‌బీ పోలీసుకు ఫిర్యాదు చేశాడు. తమను ఫోటోలు తీశావంటూ నిందిస్తూ తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని నవీన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలానే మరో కేసులో నిజాంపేట గ్రామానికి చెందిన కాసర్ల వేణు కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ రెస్టారెంట్‌ వద్దకు వచ్చాడు. అక్కడ టిఫిన్‌ పార్శిల్‌ చేయించుకొని తిరిగి వస్తుండగా అతని బైక్‌ని ఓ యువతి ఆపింది. ఆమె మాటలకు ఆకర్షితుడైన వేణు తనను బైక్ పై ఎక్కించుకొని తన గదికి తీసుకువెళ్లేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

    తన బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌లోని ఓ ఏటీఎం సెంటర్‌ వద్ద డబ్బులు డ్రా చేసేందుకు ఆగాడు. ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి బయటకు వచ్చేసరికి గుర్తు తెలియని ఒక మహిళతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి ఒక్కసారిగా అతనిపై దాడికి దిగారు. అతడిని తీవ్రంగా గాయపర్చి తన దగ్గర ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, 4.5 గ్రాముల బంగారు ఉంగరం, అందినకాడిని తన వద్ద ఉన్న డబ్బులను దోచుకెళ్లారు. వారితో పాటు తనతో వచ్చిన మహిళ కూడా వారితో పారిపోయింది. గాయాలైన వేణు వారు వెళ్లే ఆటో నంబరును నోట్ చసుకొని వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దృష్టికి వచ్చిన రెండు కేసులకు సంబంధించి ఒకటే ముఠా చేసి ఉంటుందని అనుమానించారు. బాధితుడు వేణు నుంచి దాడికి పాల్పడిన వారి ఆనవాళ్లను సేకరించారు. అలాగే వారు వచ్చిన ఆటో నెంబర్‌పై ఆరా తీయగా చివరి మూడు నెంబర్లు 258గా వేణు తెలిపాడు. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

    ఈ క్రమంలోనే తెల్లవారుజామున కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌ అండర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద వెళుతున్న ఆటోను ఆపి విచారించారు. ఆటోకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ గురించి అడగ్గా చూపించలేదు. దీంతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. వారి విచారణలో దోపిడీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. మొత్తం 14 మంది ముఠాలో విశాల్, బి.నవీన్, శైలజ, స్వాతి, నవీన్, మధు, సయ్యద్‌ మరియా, శివకుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రాము, వికాస్, సాయి, డబ్బా నవీన్, ఇర్ఫాన్, దుర్గల కోసం గాలిస్తున్నారు. ఇలాంటటి ముఠాలతో జాగ్రత్తగా ఉండాలని.. అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొద్దని సూచించారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు