మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు చేసే వారు దోషులుగా తేలిన తర్వాత వెంటనే వారికి ఉరిశిక్ష విధించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఏడేళ్ల క్రితం నిర్భయ దారుణంగా రేప్, హత్యకు గురైంది. నిందితులను ఇంకా ఉరితీయలేదు. కొన్నాళ్ల క్రితం 9 నెలల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. కింది కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. అయితే, హైకోర్టు దాన్ని జీవితఖైదుగా మార్చింది. ఇప్పుడు హైదరాబాద్లో ఓ వెటర్నరీ డాక్టర్ దారుణంగా హత్యకు గురైంది. హంతకులు దొరికారు. బాధితురాలికి న్యాయం ఎలా చేద్దాం? న్యాయం ఆలస్యం అయిందంటే.. న్యాయం జరగనట్టే. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. దీని మీద ఒక రోజు మొత్తం చర్చిద్దాం. ఐపీసీని, సీఆర్పీసీలో సవరణలు తీసుకొద్దాం. మహిళలు, చిన్నారులపై ఇలాంటి క్రూరత్వానికి పాల్పడేవారికి మరణశిక్ష విధించాలి. ఎలాంటి ఆలస్యం చేయకూడదు. కోర్టు తీర్పు మీద రివ్యూకి కూడా వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. చట్టాలు మార్చాల్సిన సమయం వచ్చింది.’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Hon’ble PM @narendramodi Ji,
7 years after Nirbhaya’s ghastly rape & murder; the convicts are still not hung!
A 9-month child is raped recently, lower court ordered capital punishment; HC revised it to life imprisonment!
A young veterinarian is barbarically murdered in Hyd 1/4
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.