• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • KRISHNA DISTRICT POLICR ARRESTED 10TH CLASS BOY FOR SEXUALLY ASSAULTED 8YEARS GIRL IN PEDANA OF ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: పానీపూరి పేరుతో చిన్నారిని సైకిలెక్కించుకెళ్లిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Andhra Pradesh: పానీపూరి పేరుతో చిన్నారిని సైకిలెక్కించుకెళ్లిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కృష్ణాజిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై పదోతరగతి విద్యార్థి అత్యాచారం

Andhra Pradesh: చట్టాలెన్ని తీసుకొచ్చిన మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. నిత్యం ఏదో ఓ చోట అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాతారాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

  • Share this:
    చట్టాలెన్ని తీసుకొచ్చిన మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. నిత్యం ఏదో ఓ చోట అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాతారాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కృష్ణాజిల్లాలో మైనర్ బాలికపై ఓ పదోతరగతి బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివగాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం నీళ్లపూడి గ్రామంలో దారుణం జరిగింది. పానీ పూరీ ఇప్పిస్తానంటూ 8 ఏళ్ల బాలికపై 10వ తరగతి చదువుతున్న బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం బాలిక పానీపూరి కోసం ఇంటి నుంచి బయటకు రాగా.. అదే సమయంలో అటువైపు వచ్చిన బాలుడు ఆమెను సైకిల్ పై ఎక్కించుకొని సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

    విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఐతే బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కృత్తివెన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని విచారించిన అనంతరం జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట ప్రవేశపెడతామని తెలిపారు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఇటీవల హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు ఇద్దరు లెక్చరర్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాద్ రాంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఆ యువతి చదువుతున్న కళాశాలలోనే మాదాపూర్‌లోని చంద్రనాయక్‌ తండాలో నివాసముంటున్న కల్యాణ్‌ వర్మ వైఎస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. అయితే యువతిపై కన్నేసిన కల్యాణ్ వర్మ, మరో లెక్చరర్ రవీందర్‌తో కలిసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

    తన ఇంట్లో విందుకు హాజరుకావాలని కల్యాణ్ వర్మ.. యువతిని ఆహ్వానించాడు. దీంతో జనవరి 29న ఆ యువతి తన సోదురుడితో కలిసి మాదాపూర్‌లోని కల్యాణ్ వర్మ ఇంటికి వెళ్లింది. ఇక, యువతి సోదరుడిని బయట ఉండాలని చెప్పిన కల్యాణ్ వర్మ.. ఆమెతో కాసేపు మాట్లాడాడు. అనంతరం అక్కడే ఉన్న రవీందర్‌తో కలిసి యువతితో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. అయితే ఆ యువతి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు