news18-telugu
Updated: August 23, 2020, 12:02 PM IST
గ్యాస్ సిలిండర్లో దాచి అక్రమంగా రవాణా చేస్తున్నమద్యంను సీజ్ చేసిన పోలీసులు
మద్యం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలంగాణ సరిహద్దులో పోలీసులు అక్రమ రవాణాకు అడ్డుకట్టువేసేందుకు చర్యలు తీసుకోవడంతో దుండగులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. వినూత్న రీతిలో ఖాళీ గ్యాస్ సిలిండర్ లోపల మద్యం బాటిళ్లను దాచి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి వస్తుండగా అనుమానంతో గ్యాస్ సిలిండర్ను తనిఖీ చేసిన పోలీసులు...అందులో మద్యం బాటిళ్లు ఉండడంతో విస్తుపోయారు. గ్యాస్ సిలిండర్ వెనుక వైపు దీని కోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ వాసు, గోపి, నందిగామ గ్రామానికి చెందిన యలగుందుల ఉదయ్ శ్రీను పోలీసులు అరెస్టు చేశారు. గ్యాస్ సిలిండర్ లోపల దాచిన 100 మద్యం బాటిళ్లు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో పాల్గొన్న జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్, ఎస్ ఐ సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇలాగే గతంలోనూ వీరు తెలంగాణ నుంచి గ్యాస్ సిలిండర్ లోపల మద్యం బాటిళ్లను దాచి కృష్ణా జిల్లాకు మద్యం బాటిళ్లు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Published by:
Janardhan V
First published:
August 23, 2020, 12:02 PM IST