సమత హత్యాచారం కేసులో చార్జిషీట్ దాఖలు...

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఈ రోజు ఛార్జి షీట్ దాఖలు చేశారు.

news18-telugu
Updated: December 14, 2019, 2:46 PM IST
సమత హత్యాచారం కేసులో చార్జిషీట్ దాఖలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఈ రోజు ఛార్జి షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఐదో అదనపు సెషన్స్ జడ్జి - ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టు గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జిల్లా జడ్జి ఎం.జి ప్రియదర్శిని వద్ద ఆసిఫాబాద్ ఎస్పీ మల్లారెడ్డి అభియోగ పత్రాలు అందజేశారు. నిందితులపై 302, 376 (డీ) సెక్షన్ల తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద మరికొన్ని అభియోగాలు మోపినట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. ఈ కేసులో 44మంది సాక్షులను విచారించ నున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో నమోదైన అభియోగ పత్రాల మేరకు కేసును విచారించనున్నట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణ రెడ్డి తెలిపారు. నిందితుల తరఫున వాదనలకు న్యాయవాదులు ముందుకు రాని పక్షం లో న్యాయ సేవా సంస్థ నుంచి న్యాయవాదిని నియమించే అవకాశం ఉందన్నారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>