హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆ మంత్రి నన్ను 3 సార్లు గర్భవతిని చేసి.. మోసం చేశాడు.. సినీ నటి సంచలన ఆరోపణలు

ఆ మంత్రి నన్ను 3 సార్లు గర్భవతిని చేసి.. మోసం చేశాడు.. సినీ నటి సంచలన ఆరోపణలు

 మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత మణికందన్ తనతో ప్రేమాయణం సాగించి.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని సినీ నటి చాందిని (శాంతిని) ఆరోపించారు. ఇద్దరం 5 ఏళ్ల పాటు సహజీవనం చేశామని.. ఆయన వల్ల తాను మూడు గర్భవతిని అయ్యాయని తెలిపారు

  తమిళనాడులో మాజీ మంత్రి మణికందన్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. పెళ్లి పేరుతో తనన తల్లిని చేసి, మోసం చేశాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆమె కన్నీళ్లుపెట్టుకున్నారు. మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత మణికందన్ తనతో ప్రేమాయణం సాగించి.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని సినీ నటి చాందిని (శాంతిని) ఆరోపించారు. ఇద్దరం 5 ఏళ్ల పాటు సహజీవనం చేశామని.. ఆయన వల్ల తాను మూడు గర్భవతిని అయ్యాయని తెలిపారు. మూడు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం గురించి బయట ఎవరికైనా చెబితే.. మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానని బెదరించినట్లు ఆమె వెల్లడించారు. ఆయనతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను మీడియాకు విడుదల చేశారు చాందిని.

  ''2017లో మణికందన్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఇద్దరం కలిసి మలేసియాలో బిజినెస్ చేద్దామని అనుకున్నాం. అప్పుడప్పుడూ ఆయన బంగ్లాకు వెళ్లేదాన్ని. తన భార్య సరిగా చూసుకోవడం లేదని నిన్ను పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పారు. అందుకే ఆయనకు శారీరకంగా దగ్గరయ్యాను. ఐదేళ్ల పాటు సహజీవనం చేశాం. ఆయన వెంట పలు అధికారిక కార్యక్రమాలకు కూడా వెళ్లాను. మూడు సార్లు గర్భం దాల్చినా బలవంతంగా అబార్షన్ చేయించారు. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెస్తే నన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు.'' అని చాందిని ఆరోపించారు.

  ఈ మేరకు మణికందన్‌తో సాగిన వాట్సప్ చాటింగ్, ఆయనతో దిగిన ఫొటోలను పోలీసులకు సమర్పించారు. చాందిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కోలీవుడ్ మూవీ నాడోడిగల్ (శంభో శివ శంభో)తో వెండి తెరకు పరిచమయ్యారు చాందిని. ప్రస్తుతం పలు మూవీల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు.

  ఐతే ఆమె చేసిన ఆరోపణలను మాజీ మంత్రి మణికందన్ కొట్టిపారేశారు. అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని ఖండించారు. తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి 2016లో ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్.. జయలలిత సీఎంగా హయంలో ఐటీ శాఖామంత్రిగా పనిచేశారు. జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ప్రస్తుతం మణికందన్ వ్యవహారం తమిళనాడులో ప్రకంపనలు రేపుతోంది.

  First published:

  Tags: Crime news, Kollywood, Tamil nadu

  ఉత్తమ కథలు