Home /News /crime /

KOLKATA YOUTH MISSING AFTER JUMPING FROM VIDYA SAGAR BRIDGE TO HOOGHLY RIVER FOR VIDEO STUNT SRD

Video Stunt : టీవీ స్టంట్ చేయాలనుకున్నాడు..ఏకంగా నదిలో దూకేశాడు.. చివరికి కథ అడ్డం తిరిగింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Video Stunt : తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. ఏదో చేయాలనుకున్నాడు. కానీ చివరికి ఏదో జరిగింది. టీవీలో వచ్చిన ఓ ప్రోగ్రామ్‌లో కనిపించిన ఓ స్టంట్ కాపీ చేయబోయిన ఓ యువకుడు..

    తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. ఏదో చేయాలనుకున్నాడు. కానీ చివరికి ఏదో జరిగింది. టీవీలో వచ్చిన ఓ ప్రోగ్రామ్‌లో కనిపించిన ఓ స్టంట్ కాపీ చేయబోయిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాలోని విద్యాసాగర్ సేతు బ్రిడ్జి మీద నుంచి ఇద్దరి యువకులు హుగ్లీ నదిలోకి దూకారు. కలర్స్ టీవీలో వచ్చే "ఖత్రోం కా ఖిలాడీ" (Khatron Ke Khiladi) ప్రోగ్రామ్‌లో చూపించిన ఓ స్టంట్ చేయడం కోసం వీరిద్దరూ నదిలోకి దూకేశారట. దానిని వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో కొంతమంది యువకులు వెల్‌కమ్ టూ ఖత్రోం కా ఖిలాడీ(Welcome To Khatron Ke Khiladi), అని అరుస్తుండటం.. మరికొందరు ఏమో "రాజా గో ఫాస్ట్" అంటూ యువకులను ఉత్సాహపరిచారు. అయితే, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. స్టంట్ పక్కన పెడితే.. నదిలోకి దూకిన ఇద్దరి యువకుల్లో ఒకరు కనిపించకుండా పోయాడు. కన్పించకుండా పోయిన యువకుడి తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

    కనిపించకుండా పోయిన యువకుడి కోసం ప్రస్తుతం రివర్ పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అలాగే, ఈ స్టంట్ లో పాల్గొన్న యువకుల్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సంట్లు సేతు బ్రిడ్జి మీద తరుచుగా జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Crime, Kolkata

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు