హోమ్ /వార్తలు /క్రైమ్ /

ముసలోడికి ఇదేం పోయేకాలం.. మెట్రోస్టేషన్ లో యువతిని అసభ్యంగా తాకుతూ.. ఆ తర్వాత..

ముసలోడికి ఇదేం పోయేకాలం.. మెట్రోస్టేషన్ లో యువతిని అసభ్యంగా తాకుతూ.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

West bengal: యువతి తన లగేజీని తీసుకుని మెట్రోరైలు ఎక్కింది. రైలులో రద్దీ కాస్త ఎక్కువగా ఉంది. ఇంతలో ఆ యువతికి ఒక 63 ఏళ్ల వ్యక్తి తన పక్కన కూర్చోమ్మని చెప్పి సీటు ఇచ్చాడు.

మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురౌతునే ఉన్నారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు అత్యాచారాలకు గురౌతున్నారు. అదే విధంగా, అత్యాచారం చేస్తున్న వారిలో కూడా పిల్లల నుంచి కాటికి కాలు చాచిన ముసలివాళ్ల వరకు ఉంటున్నారు. అత్యాచారాలకు (Harassment) పాల్పడుతున్న వారిలో ఎక్కువగా తెలిసిన వారు, దగ్గరి వారు, స్నేహితులే చేస్తున్నారు. కొందరు చాక్లెట్ ఇస్తానని చెప్పి, మరికొందరు స్నేహం ముసుగులో నమ్మించి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలు.. బడి, గుడి, బస్టాండ్,రైల్వేస్టేషన్, పోలీస్ స్టేషన్ ప్రతి చోట అత్యాచారాలకు గురౌతున్నారు. ప్రభుత్వాలు తీసుకొచ్చిన పొక్సో, దిశ, నిర్భయ చట్టాలు ఉన్న కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ఈ కోవకు చెందిన వేధింపులు ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. వెస్ట్ బెంగాల్ లో (West bengal) అమానుష ఘటన జరిగింది. కోల్ కతాలోని మైదాన్ మెట్రోరైలులో ఈ ఉదంతం శనివారం జరిగింది. ఒక యువతి.. పార్క్ స్ట్రీట్ ఏరియాలో మెట్రో (Metro train)  ఎక్కింది. రైలు అంతా రద్దీగా ఉంది. అయితే, ఒక ముసలాయన యువతికి, సీటు ఇస్తానని పిలిచాడు. ఆ తర్వాత.. ఆమెతో మాటలు కలిపాడు. తాను రిటైర్డు ఉద్యోగి అని చెప్పుకున్నాడు. కాసేపటికి వెకిలిగా ప్రవర్తించసాగాడు.

అమ్మాయిని, అసభ్యంగా తాకుతూ.. పైశాచికానందం పొందాడు. దీంతో యువతి భయంతో అక్కడి నుంచి లేచింది. అతను ఆమెను ఫాలో అయ్యాడు. హోటల్ కు రావాల్సిందిగా అభ్యర్థించాడు. దీంతో యువతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగూడారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక కోడలు అత్తపై దారుణానికి ఒడగట్టింది.

మధ్య ప్రదేశ్ (Madhya pradesh) లోని దామోహ్ జిల్లా దారుణం జరిగింది. కొడియా గ్రామంలోని హట్టా ప్రాంతంలో ఓ కోడలు తన అత్తను అత్యంత దారుణంగా కొట్టి చంపింది. కొడియా గ్రామంలో నివసిస్తున్న అజయ్ బర్మన్ అనే యువకుడు తన తల్లి నన్నీబాయితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అజయ్ బర్మన్ కు, మరో యువతితో పెళ్లయింది. అయితే, కోడలు ఎప్పుడు చూసిన ఫోన్ లోనే ఉండేది. దీంతో అత్త నన్నీబాయి విసిగిపోయింది. పద్ధతి మార్చుకొవాలని సూచించింది. కానీ ఆమె మారలేదు. పైగా అత్తపై కోపం పెంచుకుంది.ఎలాగైన అత్తను తప్పించాలను కుంది. ఒక రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

కోడలు.. కోపంతో అత్తను కర్రలతో,రాడ్ లతో ఇష్టమోచ్చినట్లు కొట్టింది. దీంతో ఆమె రక్తపుమడుగులో (Brutally murdered) కింద పడింది. ఆ తర్వాత.. కోడలు తన భర్తకు ఫోన్ చేసింది. అత్త, ఎక్కడో పడి గాయాలతో ఇంటికి వచ్చిందని కట్టుకథ అల్లింది. దీంతో అతను వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తన తల్లి చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించారు దీంతో ఆమె నిజాన్ని ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Female harassment, Harassment on women, Metro Train, West Bengal

ఉత్తమ కథలు