తల్లి సహోద్యోగిపై అత్యాచారయత్నం చేసిన యువకుడు

ప్రతీకాత్మక చిత్రం

ఆ యువకుడి పేరు ముఖర్జీ అని, అతని వయసు 23 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలు చెప్పడానికి నిరాకరించిన పోలీసులు ఆమెకు 39 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పారు.

 • Share this:
  తన తల్లి సహోద్యోగిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. బెంగళూరులో ఈ దారుణం జరిగింది. కోల్‌కతాకు చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి అక్కడే ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తల్లి కూడా ఉద్యోగం చేస్తోంది. అతడి తల్లికి కంపెనీ పనిమీద బెంగళూరులో ఓ సెమినార్‌కు వెళ్లాల్సి వచ్చింది. అతడు కూడా ఆమెతో పాటు ఆ కోల్‌కతా నుంచి బెంగళూరు సెమినార్‌కు వెళ్లాడు. ఓ పెద్ద హోటల్లో ఏర్పాటు చేసిన సెమినార్‌కు తల్లి, ఆమె కొలీగ్స్ కూడా హోజరయ్యారు. అయితే, తన తల్లితోపాటు పనిచేస్తున్న ఓ మహిళ మీద అతడు కన్నేశాడు.

  Rape attempt, Rape cases, Bengaluru News, Rape attempt on Mothers friend, Kolkata man rapes, అత్యాచారయత్నం, బెంగళూరులో అత్యాచారయత్నం, తల్లి ఫ్రెండ్‌పై రేప్, తల్లి సహోద్యోగిపై రేప్, బెంగళూరు న్యూస్,
  ప్రతీకాత్మక చిత్రం


  సెమినార్ ముగిసిన తర్వాత ఆ మహిళ హోటల్ గదికి వెళ్లిన యువకుడు మంచినీళ్లు కావాలని కోరాడు. ఆమె మంచినీళ్లు తెచ్చేలోపే ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. అందుకు ఆమె ప్రతిఘటించడంతో బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్‌లోకి లాక్కెళ్లాడు. తాను అతని తల్లి లాంటిదని హెచ్చరించింది. మద్యం మత్తులో ఉన్న ఆ కామాంధుడు ఆ మాట కూడా వినలేదు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. తన ప్రయత్నం విఫలం అవుతుందని భావించిన ఆ యువకుడు ఆమెను గట్టిగా కొట్టాడు. ఆమె రూమ్‌లో నుంచి వచ్చేసేటప్పుడు ఆమెను గట్టిగా ముద్దుపెట్టుకుని వచ్చేశాడు.

  Rape attempt, Rape cases, Bengaluru News, Rape attempt on Mothers friend, Kolkata man rapes, అత్యాచారయత్నం, బెంగళూరులో అత్యాచారయత్నం, తల్లి ఫ్రెండ్‌పై రేప్, తల్లి సహోద్యోగిపై రేప్, బెంగళూరు న్యూస్,
  నమూనా చిత్రం


  ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువకుడి పేరు ముఖర్జీ అని, అతని వయసు 23 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలు చెప్పడానికి నిరాకరించిన పోలీసులు ఆమెకు 39 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పారు.
  First published: