KOLKATA MAN OPENS HIS SHOP 9 MONTHS AFTER LOCKDOWN FINDS HIS FAVORITE RADIO AND OTHER VALUABLES STOLEN NS GH
Lockdown: 9 నెలల తర్వాత దుకాణాన్ని తెరిచాడు.. లోపల చూసి షాక్.. అసలేం జరిగిందంటే?
ప్రతీకాత్మక చిత్రం
కరోనా కట్టడికి ప్రభుత్వం మార్చి నెల నుంచి కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, లాక్డౌన్ వల్ల సాధారణ ప్రజలకు ఎంత మేలు జరిగిందో తెలియదు కానీ.. దొంగలకు మాత్రం బాగా కలిసొచ్చింది. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
కరోనావైరస్( Corona virus) మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం మార్చి నెల నుంచి కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, లాక్డౌన్ వల్ల సాధారణ ప్రజలకు ఎంత మేలు జరిగిందో తెలియదు కానీ.. దొంగలకు మాత్రం బాగా కలిసొచ్చింది. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతా(Kolkata)కు చెందిన 74 ఏళ్ల చింతామోని సోని(Chintamoni Soni) అనే చిరు వ్యాపారి న్యూ మార్కెట్ లో మొబైల్, సైకిల్ రిపేర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. 1969 నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ షాపును అదే ప్రదేశంలో నడుపుతున్నాడు. అయితే, కరోనా విజృంభనతో దేశవ్యాప్తంగా లాక్డౌన్(Lockdown ) విధించడంతో, మార్చిలో తన దుకాణాన్ని మూసివేశాడు.
అనంతరం ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) లోని మీర్జాపూర్(Mirzapur)లోని తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. కాగా, ఇటీవల ప్రభుత్వం అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా వ్యాపారాలను పునరుద్ధరణకు అనుమతివ్వడంతో ఆయన మీర్జాపూర్ నుండి తిరిగి వచ్చాడు. డిసెంబర్ 15న సోని తన షాప్ షట్టర్ తెరవగా, ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆయన షాపులో విలువైన వస్తువులు, కొంత నగదు దొంగలించబడటంతో కన్నీటిపర్యంతమయ్యాడు.
దొంగతనంపై విచారణ చేస్తున్న పోలీసులు.. తన షాపులో జరిగిన దొంగతనంపై మీడియాకు వివరిస్తూ “నేను నా షాపులోకి ప్రవేశించినప్పుడు చెల్లా చెదురుగా వస్తువులు పడి ఉన్నాయి. నా దుకాణం మొత్తం దోచుకోబడింది. నా షాపులోని విలువైన వస్తువులన్నీ పోయాయి. వెళ్లేటప్పడు కొంత డబ్బు కూడా ఇక్కడే పెట్టాను ఆ డబ్బు కూడా పోయింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరీకి నేను సుపరిచితున్నే, నా పిల్లలు కూడా ఇక్కడే పెరిగారు. అటువంటిది, నా షాపులో దొంగతనం జరగడాన్ని నమ్మలేకపోతున్నాను. లాక్డౌన్ నాకు కన్నీళ్లను మిగిల్చింది.”అని వాపోయాడు.
తన షాపులో వస్తువులు, నగదు దొంగలించబడడంపై సోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై న్యూ మార్కెట్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. “తన షాపులో దొంగలించబడిన వస్తువులు, నగదుపై సోని మాకు ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా, అతను తనకు ఎంతో ఇష్టమైన పాత రేడియో(radio) దొంగలించబడం ఎక్కువ కలత చెందుతున్నాడు. ఆ రేడియో తన హృదయానికి చాలా దగ్గరైన వస్తువని ఆయన చెప్పాడు. కేసు విచారణ కొనసాగిస్తున్నాం. ఇందులో భాగంగా షాపులోని CCTV ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం.” అని అన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.