పనిచేయని మేజిక్.. నదిలో మునిగిపోయిన మెజీషియన్

బాక్సు నదిలో పడిన తర్వాత రెండు నిమిషాలు గడిచాయి. ఐదు నిమిషాలు గడిచాయి. ఇంకా బయటకు వస్తాడని అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారు.

news18-telugu
Updated: June 17, 2019, 3:54 PM IST
పనిచేయని మేజిక్.. నదిలో మునిగిపోయిన మెజీషియన్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 17, 2019, 3:54 PM IST
ది గ్రేట్ ఎస్కేప్ మేజిక్ చేద్దామనుకున్న ఓ మెజీషియన్ నదిలో గల్లంతయ్యాడు. కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. చంచల్ లాహిరి అనే మెజీషియన్ ఓ అద్భుతమైన మేజిక్ ప్రదర్శించి తన టాలెంట్ చూపిద్దామనుకున్నాడు. ప్రజల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేద్దామనుకున్నాడు. అయితే, అది వికటించి.. అతడు నదిలో మునిగిపోయాడు. ఈనెల 16న ఆదివారం సాయంత్రం కోల్‌కతాలో ఉన్న హౌరా బ్రిడ్జి వద్ద మేజిక్ చేయడానికి చంచల్ లాహిరి పోలీసుల అనుమతి తీసుకున్నాడు. కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టుకుని, మెజీషియన్‌ను ఓ గాజు బాక్సులో పెట్టి.. దానికి తాళం వేసి, దాన్ని నదిలో పడేస్తే తనంతట తాను బయటకు రావడమే ఈ మేజిక్. అయితే, అంతా అనుకున్నట్టే జరిగింది. లాహిరి కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి.. ఓ బాక్సులో అతడిని కూర్చోబెట్టి ఓ క్రేన్ సాయంతో ఆ బాక్సును తీసుకుని వెళ్లి హుగ్లీనదిలో పడేశారు.

కొన్ని వేల మంది ఆ ప్రదర్శన చూస్తున్నారు. బాక్సు నదిలో పడిన తర్వాత రెండు నిమిషాలు గడిచాయి. ఐదు నిమిషాలు గడిచాయి. ఇంకా బయటకు వస్తాడని అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారు. పది నిమిషాలు కూడా గడిచిపోయాయి. ప్రేక్షకుల్లో ఆశ్చర్యం పోయి భయం మొదలైంది. మునిగిపోయాడా? అనే సందేహం వచ్చింది. ఆ సందేహం నిజమైంది. ఎంతసేపటికీ అతడు బయటకు రాలేదు. దీంతో వెంటనే మేజిక్ నిర్వాహకుల్లో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ వారు రంగంలోకి దిగి ఆ ప్రాంతం మొత్తం వెతికారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. లాహిరి ఆచూకీ కనిపించలేదు. నది ప్రవాహానికి కొట్టుకునిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...