KOLKATA FIANCEE KILLED WEEK BEFORE WEDDING GOES VIRAL PAH
Affair: కాబోయే భార్యకు సర్ ప్రైజ్ గిఫ్ట్.. హోటల్ కు తీసుకెళ్లి ఏంచేశాడో తెలుసా..?
సుష్మిత(ఫైల్)
Kolkata: యువతిని ప్రేమించాడు. ఆమెతోనే నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. పెళ్లికి మూహుర్తాలు కూడా తీశారు. ఈ క్రమంలో యువకుడు.. తనకు కాబోయే భార్యను హోటల్ కు తీసుకెళ్లాడు.
కొంత మంది యువత వివాహ బంధానికి (Marriage bond) ఉన్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. పెళ్లికి ముందు, తర్వాత.. ఎఫైర్ లు కొనసాగిస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరోకరితో ప్రేమాయణాలు కొనసాగిస్తున్నారు. కొంత మంది పెళ్లైన తర్వాత కూడా భర్తకు తెలియకుండా ఎఫైర్ లు (Love affair) కొనసాగిస్తున్నారు. మరికొన్ని చోట్ల పెళ్లి కుదిరిన తర్వాత యువతులు ఎఫైర్ లు కొనసాగిస్తున్నారు. కొంత మంది తమకు కాబోయే భార్యలపై అనుమానంతో దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు వార్తలలో నిలుస్తున్నాయి. ఇలాంటి సంఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. కోల్ కతాకు (kolkata) చెందిన ప్రనబ్ దాస్ (36), అండమాన్ లోని ఒక హోటల్ లో ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమలో అతనికి స్థానికంగా ఉండే సుష్మిత(26) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకొవాలను కున్నారు. ప్రనబ్ దాస్, సుష్మిత తరచుగా కలుసుకునే వారు. అయితే, ఏప్రిల్ 29 కూడా అతను కోల్ కతాకు వచ్చాడు. వెంటనే సుష్మితతో పెళ్లికి మూహుర్తాలు చూడాలని కోరాడు.
సుష్మిత ఇప్పుడు పెళ్లికి (Marriage) నిరాకరించింది. డిసెంబరు లో పెళ్లి చేసుకుందామని చెప్పింది. సుష్మిత ప్రవర్తన పట్ల .. ప్రనబ్ దాస్ అనుమానం పెంచుకున్నాడు. తన కాబోయే భర్త.. మరోకరితో ఎఫైర్ (Affair) సాగిస్తుందని అనుమానం పెట్టుకున్నాడు. దీంతో వెంటనే పెళ్లి చేయాలని వారి ఇంటిలో వారికి చెప్పాడు. ఈక్రమంలో మే 8న రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకొవాలని నిర్ణయించుకున్నారు. ప్రనబ్ గత ఆదివారం కోల్ కతా వచ్చాడు. తనకు కాబోయే భార్యకు సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి గర్ఫియా రెసిడేంట్ లోని హోటల్ కు తీసుకెళ్లాడు.
అక్కడ రోజంతా గడిపారు. సాయంత్రం డిన్నర్ కూడా చేశాడు. ఆ తర్వాత.. ఎవరికి చెప్పకుండా ప్రనబ్ దాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుష్మిత్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వారు.. హోటల్ కు వెళ్లి చూశారు. అక్కడ యువతి విగత జీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తమ కూతురిని ప్రనబ్ దాస్ అత్యాచారం చేసి చంపాడని, సుష్మిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.