Doctor Death : ఓ యువ డాక్టర్(Lady Doctor) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్ర(Maharashtra)లోని కొల్లాపూర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అయితే మృతురాలి చేతికి ఇంజెక్షన్ గుచ్చి ఉండటంతో మెడిసిన్ ఓవర్ డోస్ ద్వారా ఆమె ఆత్యహత్యకు పాల్పడిందా లేక మరేదైనా కారణాలున్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొల్హాపూర్(Kolhapur) మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ హెంద్రే కుమార్తె డాక్టర్ అపూర్వ హెంద్రే(30).. స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ లోప్రాక్టీస్చేస్తోంది. అయితే శనివారం రాత్రి ఓ కార్యక్రమానికి హజరై కాస్త ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే మళ్లీ బయటకు వెళ్లింది డాక్టర్ అపూర్వ హెంద్రే. కానీ వెళ్లేటప్పుడు ఇంటి తలుపులకు బయట నుంచి తాళం వేసుకుని వెళ్లింది. బయట తాళం వేసి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు.. పెరటి ద్వారం ద్వారా బయటకు వచ్చి రాత్రంతా ఆమె కోసం వెతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు.ఆదివారం ఉదయం.. అపూర్వ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరుతున్న సమయంలో ఆయనకు ఓ కాల్వచ్చింది. ' మీ కుమార్తె నడిరోడ్డుపై విగతజీవిగా పడి ఉంది' అని ఓ వ్యక్తి ఫోన్లో చెప్పారు. వెంటనే ప్రవీణ్ చంద్ర.. పోలీసుల దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పి వారితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నాడు. అపూర్వ మృతదేహం కొల్హాపూర్ లోని న్యూ షాహుపురి ప్రాంతంలో లభ్యమైంది.
Pasmanda Muslims : బీజేపీ బిగ్ స్కెచ్..దేశంలో ముస్లిం పార్టీలన్నీ అవుట్!
విగతజీవిగా పడి ఉన్న డాక్టర్ అపూర్వ చేతికి ఇంజెక్షన్ గుచ్చి ఉంది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న సీపీఆర్ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపూర్వ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు. అపూర్వ హ్యాండ్బాగ్లో ఉన్న మెడిసిన్ బాటిల్, మరో రెండు ఇంజెక్షన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓవర్ డోస్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లనే ఆమె చనిపోయిందా లేక ఎవరైనా హత్య చేశారా అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Death, Doctors, Maharashtra