కోడెల ఆత్మహత్య కేసు విచారణ వేగవంతం... దొరకని సెల్ ఫోన్

కోడెల శివప్రసాదరావు (File)

కోడెల సెల్ ఫోన్‌ను ఆయన కుటుంబసభ్యులు ఇంకా పోలీసులకు అప్పగించలేదని తెలుస్తోంది. కోడెల చనిపోయిన రోజు నుంచి ఆయన సెల్ ఫోన్ కనిపించకుండా పోవడంతో... ఆ ఫోన్ ఏమైందనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు.

  • Share this:
    కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కేసు విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. చనిపోయిన రోజు కోడెల చివరి ఫోన్ కాల్ తన గన్‌మెన్ ఆదాబ్‌కు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పలు సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో18 మందిని సాక్షులను విచారించారు. విచారణ నిమిత్తం వాంగూల్మం ఇచ్చేందుకు హాజరుకావాలని కోడెల కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలను పోలీసులు ఆదేశించారు. అయితే 11 రోజుల తరువాత వస్తామని వారిద్దరూ పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

    మరోవైపు కోడెల సెల్ ఫోన్‌ను ఆయన కుటుంబసభ్యులు ఇంకా పోలీసులకు అప్పగించలేదని తెలుస్తోంది. కోడెల చనిపోయిన రోజు నుంచి ఆయన సెల్ ఫోన్ కనిపించకుండా పోవడంతో... ఆ ఫోన్ ఏమైందనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇక చనిపోయిన రోజు కోడెల తిన్న ఆహారాన్ని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలుస్తోంది. మరోవైపు కోడెల ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

    First published: