కోర్టులో లొంగిపోయిన కోడెల కూతురు

కోడెల శివప్రసాదరావు(ఫైల్ ఫోటో)

షేక్ యాసిన్,ఆడపాల సాయి పెట్టిన కేసుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం నరసరావుపేట కోర్టులో విజయలక్ష్మి లొంగిపోయారు.

  • Share this:
    కొద్దివారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మీ కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్,ఆడపాల సాయి పెట్టిన కేసుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం నరసరావుపేట కోర్టులో విజయలక్ష్మి లొంగిపోయారు. ఆమెకు నరసరావుపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చార్జ్‌షీట్ నమోదు అయ్యేవరకు నరసరావుపేట వన్ టౌన్, టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రతి ఆదివారం హాజరై సంతకం చేయాలని కోర్టు షరతులు విధించింది. కోడెల ఏపీ స్పీకర్‌గా ఉన్న సమయంలో ఆయన కొడుకు శివరామ్, కూతురు విజయలక్ష్మీ సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు పలువురు పోలీసులు ఫిర్యాదు చేశారు.

    ఈ కారణంగా సత్తెనపల్లి, నరసరావుపేట పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తరువాత కొద్దిరోజులకు ఈ కేసులకు సంబంధించి శివరామ్‌కు బెయిల్ లభించగా... తాజాగా కూతురు విజయలక్ష్మికి కూడా నరసరావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. కోడెల ఆత్మహత్య కేసు విచారణ సందర్భంగా కొడుకు శివరామ్, కుమార్తె విజయలక్ష్మీ వాంగ్మూలాన్ని కూడా బంజారాహిల్స్ పోలీసులు రికార్డ్ చేశారు.
    First published: