అందరు చూస్తుండగానే నరికేశారు...హైదరాబాద్‌లో ప్రేమజంటపై దాడి

ట్రాఫిక్‌లోనే దుండగులు యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఐనా అక్కడున్న వాహనదారులు, స్థానికులు ఏ ఒక్కరూ అడ్డుకోలేకపోయారు. కత్తిపోట్లు పొడుస్తుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప..ఆపే ప్రయత్నం చేయలేదు.

news18-telugu
Updated: June 7, 2019, 10:02 PM IST
అందరు చూస్తుండగానే నరికేశారు...హైదరాబాద్‌లో ప్రేమజంటపై దాడి
యువకుడిపై దుండగుల దాడి
  • Share this:
హైదరాబాద్ నడిబొడ్డున మరో ఘోరం ..! పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘోరం..! ఎస్ఆర్‌నగర్‌ బస్టాండ్‌లో ప్రేమజంటపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. ప్రియుడిని కత్తితో పలుమార్లు పొడిచి..అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కత్తిపోట్ల కారణంగా ఆ యువకుడికి తీవ్ర రక్తస్రావమైంది. రక్తపు మడుగులో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్ 5న సంగారెడ్డికి చెందిన యువకుడు, బోరబండకు చెందని యువతి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లను ఎదురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం హైదరాబాద్‌లోనే కాపురం పెట్టారు. తమకు రక్షణ కల్పించాలని సరూర్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఇక శుక్రవారం సాయంత్రం ఓ వాహనంలో బయటకు వెళ్లారు. వారి వాహనాన్ని ఫాలో అయిన కొందరు దుండగులు ఎస్‌నగర్‌ వద్ద అడ్డగించి దాడికి పాల్పడ్డారు.

దాడి సమయంలో అక్కడ చాలా మంది స్థానికులున్నారు. నడిరోడ్డుపై వాహనాన్ని నిలిపివేయడంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. అంత ట్రాఫిక్‌లోనే దుండగులు యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఐనా అక్కడున్న వాహనదారులు, స్థానికులు ఏ ఒక్కరూ అడ్డుకోలేకపోయారు. కత్తిపోట్లు పొడుస్తుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప..ఆపే ప్రయత్నం చేయలేదు. మరికొందరైతే సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గతంలో ఇదే ఎస్‌ఆర్ నగర్‌లో ఓ ప్రేమ జంటపై దాడిజరిగిన విషయం తెలిసిందే.
First published: June 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading