ప్రస్తుతం సమాజంలో కొంత మంది పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. పసిపిల్లల నుంచి పండుముసలి వరకు వేధింపులకు గురిచేస్తున్నారు. కొందరు ఎవరైన ఏకాంతంగా దొరికితే వారిపై అఘాయత్యాలకు పాల్పడుతున్నారు. వారి ప్రైవేటు భాగాలను తాకుతూ.. పైశాచీకానందం పొందుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటనలో బాంబే హైకోర్టు (Bombay high court) సంచలన తీర్పు వెలువరించింది.
పూర్తి వివరాలు.. ముంబై లో (mumbai) గతేడాది దారుణం జరిగింది. ఒక బాలుడు ఆన్ లైన్ గేమ్ రిచార్జీ కోసం నగర శివారులోని దుకాణానికి వెళ్లాడు. అక్కడు దుకాణ యజమాని బాలుడి పట్ల అసహజంగా ప్రవర్తించాడు. అతని పెదవులపై ముద్దులు పెట్టుకుంటూ, ప్రైవేటు భాగాలను చేతితో తడిమి పైశాచీకానందం పొందాడు. బాలుడు భయపడిపోయి ఇంటికి వచ్చేశాడు. జరిగిన దారుణాన్ని తన తండ్రికి తెలిపాడు. దీంతో వారు సమీపంలోని పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం (Pocso act) కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడి తరపు న్యాయవాది.. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అనూజా ప్రభుదేసాయి నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. అదే విధంగా, నిందితుడు లైంగిక దాడి (rape on boy) చేసినట్లు ఎలాంటి మెడికల్ టెస్ట్ లలో రుజువు కాలేదని అన్నారు. కాగా, బాలుడిని ముద్దు పెట్టడం అసహజ నేరంకాదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులు అరెస్టు అయిన వారికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. ప్రస్తుతం మాత్రం నిందితుడికి తాత్కలిక బెయిల్ మంజురు చేస్తు కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.
ఢిల్లీలో (Delhi) గతంలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
దేశంలో మహిళలు, అమ్మాయిల భద్రత పట్ల తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ప్రతి రోజు మహిళలపై (Rape on girl) అఘాయిత్యాలు, దాడుల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. సఫ్దర్ జంగ్ ప్రాంతంలో ఒక మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మే 11 న జరిగింది. కాగా, సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 62 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుంది. ఆమెను బంధువులు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటారు. ఈ క్రమంలో.. ఆమెకు ఇంటి దగ్గర క్యాబ్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె ఎక్కడికి వెళ్లాలన్న అదే క్యాబ్ లో వెళ్లేది.
బాధితురాలు.. మే 11 న కన్నాట్ ప్రాంతానికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు చీకటిపడింది. అప్పుడు క్యాబ్ డ్రైవర్ కారును (cab driver) నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెను బలవంతంగా కారులో నుంచి బయటకు లాగి కిందపడేశాడు. ఆ తర్వాత.. అత్యాచారానికి (Rape on woman) పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతొో తీవ్రంగా గాయపర్చాడు. ఆ తర్వాత.. ఆమెను రోడ్డుమీద తీసుకొచ్చి వదిలేసి పారిపోయాడు. ఈ క్రమంలో బాధితురాలు, తీవ్ర గాయాలపాలైన దశలో స్థానికులు ఆమెను గుర్తించారు. వెంటనే పోలసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.