ముద్దు పెడితే గర్ల్‌ఫ్రెండ్‌కు 300 కుట్లు... ఇదేం ముద్దురా మొద్దు...

బ్రేకప్ చెప్పిన మాజీ ప్రేయసికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని భావించిన ప్రియుడు... ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించి, గట్టిగా కొరికేసి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 6:06 PM IST
ముద్దు పెడితే గర్ల్‌ఫ్రెండ్‌కు 300 కుట్లు... ఇదేం ముద్దురా మొద్దు...
గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దు పెడితే 300 కుట్లు (సంఘటనకు ముందు ఫోటో)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 6:06 PM IST
ముద్దు పెడితే అమ్మాయిలు సిగ్గుతో ముడుచుకుపోవాలి. అదరచుంబనం అంటే అరిటాకు మీదనున్న తేనేను జుర్రుకున్నట్టుగా రసవత్తరంగా ఉండాలి. కానీ ముద్దుని కూడా క్రూరంగా గాయపరిచేంత కఠినంగా ఉంటుందని నిరూపించాడో కఠిన హృదయుడైన ప్రియుడు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన అమెరికాలోని సౌత్ కరోలినా ఏరియాలో వెలుగు చూసింది. గ్రీన్‌విల్లే ఏరియాకు చెందిన కైలా అనే యువతి, అదే ఏరియాకు చెందిన సెథ్ ఆరన్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ 2016 నుంచే డేటింగ్ కూడా చేశారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో కైలా... బాయ్‌ఫ్రెండ్‌ సెథ్ ఆరన్‌ను దూరం పెడుతూ వచ్చింది. తన ఫీలింగ్స్‌కు విలువ ఇవ్వని సెథ్‌తో కలిసి ఉండడం ఇష్టం లేక బ్లేక్ అనే మరో యువకుడితో క్లోజ్‌గా ఉండడం మొదలెట్టింది. అయితే కైలాను మరిచిపోవడం ఇష్టంలేని సెథ్... ఆమెకు తరచూ ఫోన్ చేస్తూ క్షమించాల్సిందిగా, తిరిగి ప్రేమించాల్సిందిగా కోరుతూ వచ్చాడు. సెథ్ కోరికను కైలా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన అతను... చివరి సారిగా తెగతెంపులు చేసుకోవడానికి ఓ గ్రీటింగ్ కార్డు పంపాడు.

kiss, lip lock kiss, kiss kills, lady get 300 stitches after lip-lock kiss, forceful kiss, kissed girl friend hardly, deep lip-lock kiss, ముద్దు, అదర చుంబనం, ముద్దు పెడితే ప్రియురాలి మూతి పగిలింది, ముద్దు పెట్టినందుకు జైలుశిక్ష, ప్రియురాలి మూతికి 300 కుట్లు, సౌత్ కరోలినా
చికిత్స సమయంలో కైలా


ఆ గ్రీన్‌కార్డు ప్రపోజల్ మెచ్చిన కైలా... చివరిసారిగా మాజీ బాయ్‌ఫ్రెండ్ సెథ్ ఆరన్‌ను కలవాలనుకుంది. అనుకున్నట్టుగానే ఇద్దరూ ఓ చోట కలుసుకున్నారు. కైలాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని భావించిన సెథ్... ఆమెకు ముద్దుపెట్టడానికి ప్రయత్నించాడు. అయితే ప్రస్తుతం వేరే వ్యక్తితో డేటింగ్ చేస్తున్న ఆమె, సెథ్ ఆరన్‌ను ముద్దు పెట్టుకునేందుకు అంగీకరించలేదు. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సెథ్... కైలాను గట్టిగా పట్టుకుని ఆమె పెదవుల కింద గట్టిగా కొరికేశాడు. కసితీరా కోరకడంతో పెదవుల కిందా, పైనా తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆసుపత్రికి వెళ్లగా కైలాకు 300 కుట్లు వేశారు వైద్యులు. సెథ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని న్యాయస్థానంలో హాజరుపర్చారు. నేరాన్ని అంగీకరించడంతో అతనికి 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది న్యాయస్థానం. అయితే సెథ్ చేసిన గాయం మాత్రం కైలా ముఖంపై అలాగే ఉండిపోయింది.

First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...