• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • KIDNAPPERS KILLED JOURNALIST SON IN MAHABOOBABAD FULL DETAILS HERE MS

ఆ బాలుడిని చంపేశారు..! అన్నంత పని చేసిన కిడ్నాపర్లు.. మహబూబాబాద్ లో విషాదం

ఆ బాలుడిని చంపేశారు..! అన్నంత పని చేసిన కిడ్నాపర్లు.. మహబూబాబాద్ లో విషాదం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహబూబాబాద్ జిల్లా కిడ్నాప్ కేసు కథ విషాదాంతమైంది. జర్నలిస్టు కుమారుడిని కిడ్నాపర్లు చంపేసినట్టు పోలీసులు తెలిపారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    తెలంగాణ లో సంచలనం సృష్టించిన దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ కథ విషాదాంతమైంది. ఐదు రోజుల క్రితం ఆ పిల్లాడిని పలువురు గుర్తు తెలియని కిడ్నాపర్లు అపహరించిన విషయం తెలిసిందే. కాగా, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారం శివారు ప్రాంతాల్లోని గుట్టల్లో ఆ బాలుడి మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. బాలుడి మృతి వార్త విన్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక టీవీ ఛానెల్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న రంజిత్ కుమారుడే దీక్షిత్. ఆదివారం నాడు ఆ బాలుడు కిడ్నాపైన విషయం తెలిసిందే. రూ. 45 లక్షలిస్తేనే ఆ బాలుడిని వదిలేస్తామని నిందితులు రంజిత్ ను బెదిరించారు. కిడ్నాపర్లు అన్నంత పనిచేశారు.

    మహబూబాబాద్ లో కృష్ణ కాలనీలో ఉంటున్న రంజిత్.. ఓ ప్రముఖ టీవీ చానల్‌లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. రంజిత్, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి(9). ఆదివారం రోజున బైక్ వచ్చిన ఓ వ్యక్తి బాలుడిని ఎత్తికెళ్లాడు. ఎంతసేపటికి దీక్షిత్ జాడ తెలియకపోవడంతో అతడి తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. కానీ అతడు కనిపించలేదు. తోటివారిని ఆరా తీయగా.. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి దీక్షిత్‌ను తీసుకునివెళ్లాడని వాళ్లు చెప్పారు. ఇక, రాత్రి 10 గంటలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ. 45 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే బాలుడిని విడిచిపెడతామని కిడ్నాపర్లు చెప్పారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారు. పోలీసులకు చెప్పినా పిల్లాడిని చంపేస్తామని బెదిరించారు.

    కాగా.. డబ్బివ్వడానికి రెడీ గా ఉన్నానని చెప్పిన దీక్షిత్ తండ్రి.. కిడ్నాపర్లు సూచించిన ప్రాంతానికి వస్తానని చెప్పాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కిడ్నాపర్లు చెప్పిన స్పాట్ కు వెళ్లాడు. వాళ్లు చెప్పిన దగ్గర డబ్బుల బ్యాగ్ పెట్టి వచ్చాడు. అయితే అదే ప్రాంతంలో మాటు వేసిన పోలీసులు.. అర్ధరాత్రి సమయంలో కిడ్నాపర్ల రాకను గమనించి వారిని అదుపులోకి తీసుకున్నారు.  కానీ కిడ్నాపర్లు మాత్రం అప్పటికే ఆ బాలుడిని హత్య చేసినట్టు తెలుస్తున్నది. హత్య కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు