ఖమ్మం టాస్క్ ఫోర్స్... నేరస్తుల పాలిట సింహస్వప్నం..

ట్రాక్టర్‌ ట్రాలీ అడుగుభాగాన ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలో నిల్వ ఉంచిన 440 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

news18-telugu
Updated: July 4, 2020, 2:22 PM IST
ఖమ్మం టాస్క్ ఫోర్స్... నేరస్తుల పాలిట సింహస్వప్నం..
ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఇటీవల పట్టుకున్న గంజాయి
  • Share this:
(జి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

గంజాయి రవాణా.. నిషేధిత గుట్కా సరఫరా .. నకిలీ విత్తనాలు అమ్మకం.. చౌక బియ్యం రీసైక్లింగ్‌.. అక్రమం ఏదైనా ఖమ్మంలో మాత్రం నో ఛాన్స్‌. ఎక్కడెక్కడ ఏమేం చేసినా అక్రమార్కులు ఖమ్మం పొలిమేర దాటారంటే మాత్రం అడ్డంగా దొరికిపోవాల్సిందే. కారణం టాస్క్‌ఫోర్స్‌. ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి ముంబై లాంటి మెట్రో నగరాలకు రకరకాల మార్గాలలో తరలిపోయే గంజాయి మొదలు, ఆరోగ్యానికి అనర్థమంటూ ప్రభుత్వం నిషేధించిన గుట్కాల అక్రమ విక్రయాలు.. వ్యవసాయ సీజన్‌లో పేద రైతలకు కొందరు వ్యాపారులు అంటగట్టే నకిలీ విత్తనాలు సహా.. ఇక కాకినాడ పోర్ట్‌ ద్వారా సముద్ర మార్గాన విదేశాలకు తరలిపోయే తెలంగాణ సన్నరకం చౌకబియ్యం దాకా ఎక్కడ అక్రమం ఉంటే అక్కడ టాస్క్‌ఫోర్స్‌ వాలిపోతోంది. నేరస్తులకు బేడీలు వేస్తోంది. ఇప్పుడు ఖమ్మంలో ఎక్కడ చూసినా టాస్క్‌ఫోర్స్‌ ముచ్చటే. కారణం చిన్న విభాగంగా ఏర్పాటై వరుస టాస్క్‌లతో అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ విభాగం పనితీరు పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటోంది.

ట్రాక్టర్ కింద సీక్రెట్ అల్మారాలో దాచిన గంజాయి


నాలుగేళ్ల క్రితం పోలీసు కమిషనరేట్‌గా ఏర్పడుతూనే ఖమ్మంలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. రెగ్యులర్‌ పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులు, కోర్టు డ్యూటీలు, ఇంకా కేసుల ఫాలోఅప్‌ లాంటి విధుల వత్తిడి తెలిసిందే. దీంతో కేవలం అక్రమాలను నిరోధించడానికే ఉద్దేశించిన టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి ఏసీపీ స్థాయి అధికారిని నియమించారు. ఇంకా ఈ విభాగానికి ఓ సీఐ, ఇద్దరు ఎస్సైలు, కొంతమంది పోలీసు సిబ్బందిని అప్పగించారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీగా నియమితుడైన ఘంటా వెంకటరావు అక్రమార్కులపై విరుచుకుపడుతున్నారు. రకరకాల స్థాయుల్లో సమాచార సేకరణకు సోర్స్‌ను ఏర్పాటు చేసుకుని పక్కా స్కెచ్‌ వేసి మరీ అక్రమార్కులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. నేరస్థులు వేసే రకరకాల చిత్రవిచిత్ర ఎత్తుగడలను టాస్క్‌ఫోర్స్‌ చిత్తుచేస్తోంది.

ట్రాక్టర్ కింద సీక్రెట్ అల్మారాలో దాచిన గంజాయిని బయటకు తీస్తున్న పోలీసులు


తాజాగా శనివారం రోజున ఖమ్మం నగరంలో ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలోని ట్రాక్టర్‌ ట్రాలీ అడుగుభాగాన ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలో నిల్వ ఉంచిన 440 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని ఇలా కొత్తరకంగా తరలించే ప్రయత్నం చేయడం, ఎలాంటి అనుమానం రాకుండా జనావాసాల మధ్యన పార్క్‌ చేయడం.. అదీ వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్‌ ట్రాలీలో రహస్య ప్రాంతంలో దాచడం అక్రమార్కుల కొత్తరకం ఎత్తుగడ. అయినా టాస్క్‌ఫోర్స్‌ పసిగట్టింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రెయిడ్‌ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. గత కొన్నేళ్లుగా ఇదే తరహా అక్రమ వ్యాపారం చేస్తున్న ఇస్లావత్‌ శంకర్‌ను అదుపులోకి తీసుకుంది.

దీంతోపాటు బ్లాక్‌ గ్రానైట్‌ నిక్షేపాలకు నిలయంగా ఉన్న ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల నుంచి విదేశాలకు తరలిపోయే ఖనిజానికి సంబంధించి ట్యాక్షేషన్‌పైనా గతంలో టాస్క్‌ఫోర్స్‌ దృష్టిసారించింది. ఓవర్‌ లోడింగ్‌, ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ చెల్లింపు జరిగిందా లేదా అన్నదానిపై దృష్టి సారించింది. దగ్గరిలో ఉన్న సముద్ర తీరాలైన కాకినాడ పోర్టుకు ఖమ్మం ద్వారా మాత్రమే దగ్గరి దారి ఉండడంతో గ్రానైట్‌కు, చౌక బియ్యం తరలింపునకు ఇదే మార్గంగా మారింది. దీంతో బాటు ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలోని కొండ ప్రాంతాలలో రహస్యంగా పండించిన గంజాయిని దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై‌, పూణె, బెంగళూరు, హైదరాబాద్‌ సహా ఇంకా ప్రధాన నగరాలకు పోయే మార్గం ఇదే కావడంతో ఖమ్మం ఒక గుమ్మంలా మారింది. గత కొన్నేళ్లుగా రహస్యంగా సాగుతున్న ఇలాంటి అక్రమాలకు టాస్క్‌ఫోర్స్‌ చెక్‌పెడుతూ ఉంది. ఎప్పటికప్పుడు పక్కా సమాచారంతో దాడులు చేస్తూ ప్రజల్లో భరోసాను కల్పిస్తూ, అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 4, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading