ఖమ్మం డిపోలో బస్సు మిస్సు... వెతికితే తెలిసిందేంటంటే..

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఆర్టీసీ బస్ డిపోకు చెందిన ఓ బస్సు కనిపించకుండా పోయింది.

news18-telugu
Updated: July 4, 2020, 7:27 PM IST
ఖమ్మం డిపోలో బస్సు మిస్సు... వెతికితే తెలిసిందేంటంటే..
మళ్లీ దొరికిన బస్సు
  • Share this:
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఆర్టీసీ బస్ డిపోకు చెందిన ఓ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ అద్దె బస్సు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. గురువారం సాయంత్రం బస్సును డిపోలో ఉంచినట్టు ఆ బస్సు యజమాని తెలిపారు. శుక్రవారం ఉదయం వచ్చే సరికి బస్సు కనిపించలేదని అన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యి బస్సు కోసం గాలింపు చేపట్టగా, తల్లాడ ప్రాంతానికి చెందిన సత్యన్నారాయణ అనే లారీ డ్రైవర్ ఈ బస్సును ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. బస్సుతో సహా లారీ డ్రైవర్ ను చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో పట్టుకొని, నిందితుడిని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, లారీ డ్రైవర్ సత్యన్నారాయణలో కరోనా లక్షణాలు కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే లారీ డ్రైవర్ సత్యన్నారాయణను ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ గా తేలితే, సత్తుపల్లి పోలీస్ స్టేషన్లోని పోలీసులు క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 4, 2020, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading