28 రోజులు మృత్యువుతో పోరాడి... తుదిశ్వాస విడిచిన ఖమ్మం అత్యాచార బాధితురాలు

కామాంధుడి అకృత్యానికి బలైన ఆ బాలిక.. కన్నుమూసింది. 28 రోజుల పాటు చావు బతుకుల మధ్య పోరాడిన ఆ బాధితురాలికి కాలం కలిసిరాలేదు. 70 శాతం కాలినగాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

news18
Updated: October 16, 2020, 12:51 PM IST
28 రోజులు మృత్యువుతో పోరాడి... తుదిశ్వాస విడిచిన ఖమ్మం అత్యాచార బాధితురాలు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 16, 2020, 12:51 PM IST
  • Share this:
కామాంధుడి అకృత్యానికి బలైపోయిన ఖమ్మం బాలిక (12)కన్నుమూసింది. ‘అన్నా’ అని పిలిచినా కనికరించకుండా.. ప్రతిఘటించిందన్న అక్కసుతో పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనలో 70 శాతం కాలిపోయి, 28 రోజుల పాటు మృత్యువుతో పోరాడి అలసిన ఆ బాలిక.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచింది. ఖమ్మం రూరల్‌ మండలం పల్లగూడేనికి  చెందిన ఆ బాలికను.. కరోనా వల్ల వచ్చిన ఆర్థిక కష్టాల కారణంగా తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. ఈ క్రమంలో.. ఆ బాలికకు ప్రమాదవశాత్తూ నిప్పంటుకుందని, స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చామని ఇంటి యజమాని సెప్టెంబరు 18 న బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.  17 రోజుల పాటు ఆ ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలిక.. కొద్దిగా కోలుకుంది.
ఈ నెల 5న తన తల్లికి తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. అప్పటికి గానీ జరిగిన ఘోరం వెలుగులోకి రాలేదు.

సెప్టెంబరు 18న ఉదయం 6 గంటలకు బాలిక నిద్రిస్తున్న గదిలోకి వెళ్లిన ఆ ఇంటి యజమాని కుమారుడు అల్లం మారయ్య.. ఆమెపై అత్యాచారయత్నం చేయబోగా ప్రతిఘటించి దూరంగా నెట్టేసింది. ఈ అక్కసుతో అక్కడున్న పెట్రోలును ఆమెపై పోసి నిప్పంటించాడు.

అనంతరం అతడు, అతని తండ్రి సుబ్బారావులు మంటలార్పి ఆస్పత్రికి తరలించారు. ఇంత జరిగినా.. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వకుండానే 17 రోజుల పాటు ఆ బాలికకు రహస్యంగా చికిత్స చేసింది. చివరికి బాలిక నోరు విప్పడంతో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.
ఆస్పత్రి నిర్వాకంపై విచారణ జరిపిన జిల్లా వైద్యశాఖ సీజ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. ఆమె మరణ వాంగ్మూళాన్ని జడ్జి నమోదు చేశారు. జడ్జి, సీపీ, జిల్లా వైద్యాధికారులు తనను పరామర్శించిన సమయంలో తనపై జరిగిన అఘాయిత్యాన్ని పూసగుచ్చినట్టు వివరించింది.

khammam, khammam news, rape, pallaguda, khammam crime news, telanagana, telangana news, sexual harassment, hyderabad crime news
ఆస్పత్రిని సీజ్ చేస్తున్న అధికారులు


బాలిక పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందించారు.

అయినా ఫలితం లేకపోయింది. 28 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక చివరికి కన్నుమూసింది. ఈ దారుణమైన ఎపిసోడ్ లో ఒకవైపు ఒళ్లంతా కాలి ప్రాణాలకోసం ఆ బాలిక పోరాడుతుండగా.. కుల పెద్దలు పంచాయతీలు చేస్తూ చలి కాచుకునే ప్రయత్నం దారుణాన్ని తలపిస్తోంది. అత్యాచార యత్నానికి బలైపోయిన ఆమె తల్లిదండ్రులను కుల పంచాయతీకి ఒప్పించే ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతుండడం మానవత్వానికే మచ్చగా మారింది.

దేశంలో లైంగికదాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవడానికి కఠినమైన చట్టాలున్నప్పటికీ అందులోని లోపాల  కారణంగా నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో లైంగికదాడులకు గురైన బాధితుల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు బాధ్యులైనవారు మాత్రం యదేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతుండటం గమనార్హం.
Published by: Srinivas Munigala
First published: October 16, 2020, 12:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading