ఇద్దరు చిన్నారుల చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన ఖమ్మం పోలీస్ ఆఫీసర్

ఆ ఇద్దరు చిన్నారుల తల్లి మరో వ్యక్తితో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. అతడితో వెళ్లిపోవడానికి ముందు తన ఇద్దరు పిల్లలను ఖమ్మం బస్టాండులో వదిలి వెళ్లిపోయింది.

news18-telugu
Updated: October 22, 2020, 9:09 PM IST
ఇద్దరు చిన్నారుల చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన ఖమ్మం పోలీస్ ఆఫీసర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమ్మ అంటే ప్రత్యక్ష దైవం అంటాం. ప్రపంచంలో ఎవరైనా తల్లి తరువాతే అంటారు. అలాంటి తల్లే దారి తప్పింది. తన సుఖం కోసం ఇద్దరు పిల్లలను వదిలించుకుంది. అనాధల్లా రోడ్డు మీద వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ పిల్లలు అనాధల్లా బస్టాండ్‌లో ఉంటే వారిని కన్నబిడ్డల్లా సాకారు ఖమ్మం పోలీసులు. ఖమ్మం నగరంలో ఇల్లందు క్రాస్ రోడ్డులో ఇద్దరు పిల్లలు ఏడుస్తూ కనిపించారు. ‘అమ్మా అమ్మా’ అంటూ వారు ఏడుస్తున్నారు. ఖమ్మం టూ టౌన్ సీఐ తుమ్మ గోపి, మహిళ కానిస్టేబుల్ రేణుక ఇద్దరు పిల్లలను చేరదీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి కొత్త బట్టలు కొని ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురానికి చెందిన తండ్రి జల్లి వేంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చి చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సమక్షంలో తండ్రి జల్లి వేంకటేశ్వర్లకు చిన్నారులను అప్పగించారు. ఆ ఇద్దరు చిన్నారుల తల్లి మరో వ్యక్తితో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. అతడితో వెళ్లిపోవడానికి ముందు తన ఇద్దరు పిల్లలను ఖమ్మం బస్టాండులో వదిలి వెళ్లిపోయింది. వాళ్లు ఏడుస్తూ ఉంటే సీఐ గోపి వివరాలు తెలుసుకున్నారు. మూడు రోజుల పాటు వారు ఉండేందుకు వసతి కల్పించారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ అధికారి ద్వారా తండ్రికి అప్పగించారు. తల్లి ఇలా చేయడం ఇది మూడోసారి.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 22, 2020, 9:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading