Home /News /crime /

KHAMMAM MINOR GIRL MISSING CASE POLICE INVESTIGATING ON LETTER WHICH SAYS SHE WENT FOR STUDIES SK KMM

Minor Missing case: సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ... ఖమ్మంలో అదృశ్యమైన ఆ బాలిక ఏమైంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్షుద్ర పూజలు చేసి బాలికను బలిచ్చారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో.. ఆమె తన స్నేహితురాలి దగ్గరకు చదువు నిమిత్తం వెళ్లిందన్న వాదన తాజాగా వినిపిస్తోంది. ఆమె రాసినట్టు చెబుతున్న ఓ లేఖ బయటకొచ్చింది.

  ఖమ్మంలో మైనర్ బాలిక మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీ వీడలేదు. అచ్చం క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ.. పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసులో ఇంకా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తమ కన్నబిడ్డ ఏమైంది..? అసలు ఉందా.. ఏమైనా చేశారా అన్న బెంగతో ఆ తల్లిదండ్రులు తల్లఢిల్లిపోతున్నారు. తమ కూతురిని చూపించండని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఐతే క్షుద్ర పూజలు చేసి బాలికను బలిచ్చారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో.. ఆమె తన స్నేహితురాలి దగ్గరకు చదువు నిమిత్తం వెళ్లిందన్న వాదన తాజాగా వినిపిస్తోంది. ఆమె రాసినట్టు చెబుతున్న ఓ లేఖ బయటకొచ్చింది. దాంతో పోలీసులు పూర్తి గందరగోళంలో పడ్డారు. కేసును మరింత సీరియస్‌గా తీసుకున్నారు.

  ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో గత నెల 17న వెల్లంకి రాజశ్రీ అనే బాలిక కనిపించకుండా పోయిందని ఆమె తల్లి రాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు మామ వరుసయ్యే వ్యక్తి గద్దె నర్సింహారావు ఇంట్లో మూడడుగుల వెడల్పున, ముప్పై అడుగుల లోతున గొయ్యి తీసి గత పదిహేను రోజులుగా క్షుద్ర పూజలు చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. నిత్యం ఎర్రుపాలెం, జమలాపురం, విజయవాడలకు చెందిన పూజారులు వచ్చి పూజలు నిర్వహించారని తెలుస్తోంది. అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి వచ్చే పూజారి నేతృత్వంలో ఈ క్షుద్ర పూజలు చేసినట్టు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు ఆయా పూజారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయినా ఎలాంటి క్లూ లభించలేదు.

  గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రుపాలేనికి చెందిన పూజారి ప్రకాష్‌ ఈ కేసులో కీలకంగా మారినట్టు గుర్తించారు. ఇతన్నే స్థానిక పూజారులు నిత్యం పూజ సమయంలో ఫోన్‌ ద్వారా సంప్రదించేవారని చెబుతున్నారు. అయితే బాలిక మిస్సింగ్‌ కేసు నమోదైన రోజు నుంచి ప్రకాష్‌ ఆచూకీ లేదు. అయితే మిస్ అయిన మైనర్‌ బాలిక రాజశ్రీ పూజారి ప్రకాష్‌ వెంటే ఉందన్న వాదన కూడా ఉంది. ప్రకాష్‌శర్మ భార్య బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తోంది. అక్కడే ఆమెకు ఓ ఆశ్రమం కూడా ఉన్నట్టు గుర్తించారు. ప్రధాన పూజారిగా చెబుతున్న ప్రకాష్‌శర్మ భార్య నిర్వహిస్తున్న ఆశ్రమానికే బాలికను తరలించినట్టు అనుమానిస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి సాంకేతికపరమైన ఆధారాలు లభ్యం కావడం లేదు.

  అయితే మిస్సింగ్‌ అయిన రాజశ్రీతో ఉన్నట్టు భావిస్తున్న ప్రకాష్‌శర్మ మొబైల్‌ లొకేషన్‌ను ట్రేస్‌ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరు బాలిక మిస్‌ అయిన రోజుల్లో ఏపీలోని తిరుమలగిరి, ద్వారాకాతిరుమల పుణ్యక్షేత్రాలకు సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. కొన్నిసార్లు అనంతపురం జిల్లాలో కూడా మొబైల్‌ ట్రేస్‌ అయినా నిర్ధరణ చేయడంలేదు. అయితే మైనర్‌ బాలిక మిస్సింగ్‌ కేసులో పోలీసుల నిర్లిప్త వైఖరి విమర్శల పాలవుతోంది. కనీసం గాలింపు బృందాలను కూడా నియమించలేదన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న స్థానిక పూజారులు, మామ గద్దె నర్సింహారావు, బాబాయిలు ఇప్పటిదాకా ఎలాంటి విలువైన సమచారాన్ని ఇవ్వలేదు.

  ఈకేసులో కీలకమైన క్షుద్ర పూజలు నిర్వహించిన ఇంటి యజమాని నర్సింహారావు.. పూజా స్థలం చూడ్డానికి వెళ్లిన పోలీసులను అడ్డుకోవడం.. గత పదిహేను రోజులుగా పూజలు చేస్తుండడం.. ఎక్కడెక్కడి నుంచో పూజారులను తీసుకొనిరావడం.. రేయింబవళ్లు ఎడతెరిపి లేకుండా మంత్రాలు, తంత్రాలతో ఊరిని హడలు కొట్టడం లాంటి వాటిపై పోలీసులు దృష్టి సారించారు. దీనికితోడు మిస్సింగ్‌ అయిన రాజశ్రీ తాను చదువు నిమిత్తం స్నేహితురాలి దగ్గరకు వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు క్లుప్తంగా రాసి పెట్టిన నోట్ పైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు అది ఆమె చేతిరాతేనా..? ఒకవేళ నిజమే అయితే ఎవరి దగ్గరకు వెళ్లింది... ? ఆస్నేహితురాలు ఎవరు? పేరు ఎందుకు రాయలేదన్న అనుమానాలు ముప్పిరిగొంటున్నాయి. ఏదిఏమైనా తమ బిడ్డ క్షేమంగా ఉంటే చాలని రాజశ్రీ తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Crime story, Khammam, Missing case

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు