KHAMMAM MAN COMMITS SUICIDE AS HE GETS LOSS IN CRYPTO CURRENCY TRADING SK
Crypto Currency: క్రిప్టో కరెన్సీలో భారీగా పెట్టుబడి.. నష్టాలు రావడంతో విషం తాగి ఆత్మహత్య
Crypto Currency: క్రిప్టో కరెన్సీ యువత భవితను నాశనం చేస్తుందని కొన్ని రోజుల క్రితమే ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన చెప్పినట్లుగానే తెలంగాణలో దారుణం జరిగింది. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Crypto Currency: క్రిప్టో కరెన్సీ యువత భవితను నాశనం చేస్తుందని కొన్ని రోజుల క్రితమే ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన చెప్పినట్లుగానే తెలంగాణలో దారుణం జరిగింది. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
క్రిప్టో కరెన్సీ యువత భవితను నాశనం చేస్తుందని కొన్ని రోజుల క్రితమే ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన చెప్పినట్లుగానే తెలంగాణలో దారుణం జరిగింది. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆన్లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. క్రిప్టో కరెన్సీలో పెద్ద మొత్తంలో నష్టం రావడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.ప్రతీకాత్మక చిత్రం)
ఖమ్మం పట్టణానికి చెందిన గుండెమెడ రామలింగస్వామి (36) క్రిప్టో కరెన్సీలో బాగా లాభాలు వస్తాయని ఆశించి.. ఇద్దరు స్నేహితులతో కలిసి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఐతే లాభాలు రాకపోగా భారీగా నష్టం రాడంతో.. మనస్తాపానికి గురయ్యారు.(ప్రతీకాత్మక చిత్రం)
పెట్టిన డబ్బులన్నీ పోవడంతో కుటుంబానికి తన ముఖాన్ని చూపించలకపోయాడు. ఈ క్రమంలోనే మంగళవారంసూర్యాపేటకు వచ్చి ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుమందు తాగి మృతిచెందారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆయన ఉన్న గదిలోంచి బుధవారం ఉదయం దుర్వాసన వస్తుండటంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసలులు వచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే రామలింగస్వామి మృతదేహం కనిపించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఘటనా స్థలంలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ ఆయన భార్య స్వాతి పేరిట లేఖ రాశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
మన దేశంలో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్రం కసరత్తులు చేసింది. ద క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 పేరిట బిల్లును ఈ శీతకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.