హోమ్ /వార్తలు /క్రైమ్ /

Pregnant Women: రైల్వే స్టేషన్ వద్ద నొప్పులతో గర్భిణి.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది..

Pregnant Women: రైల్వే స్టేషన్ వద్ద నొప్పులతో గర్భిణి.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది..

ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లి

ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లి

Pregnant Women: ఓ మహిళ గర్భిణితో ఉంది. రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో నొప్పులు విపరీతంగా వచ్చాయి. దీంతో ఆమె రైలు మార్గంలోని ఓ ప్రదేశం వద్ద దిగి ఆపుపత్రికి బయలుదేరుతుండగా.. నొప్పులు ఎక్కువ అవ్వడంతో అక్కడే ఉన్న మహిళా కార్మికులు పురుడుపోశారు. ఆమె పండంటి ఆడపిల్లను జన్మనిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  ఓ మహిళ గర్భిణి (Pregnant Women) తో ఉంది. రైలు(Train)లో ప్రయాణిస్తున్న క్రమంలో నొప్పులు విపరీతంగా వచ్చాయి. దీంతో ఆమె రైలు మార్గంలోని ఓ ప్రదేశం వద్ద దిగి ఆపుపత్రి(Hospital)కి బయలుదేరుతుండగా.. నొప్పులు ఎక్కువ అవ్వడంతో అక్కడే ఉన్న మహిళా కార్మికులు పురుడుపోశారు. ఆమె పండంటి ఆడపిల్లను జన్మనిచ్చింది. ఇలా 20 కిలోమీటర్ల దూరం నుంచి అంబులెన్స్‌(Ambulance) వచ్చే వరకు వేచి చూడకుండా స్థానికులు ఆమెకు పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.

  Shocking Incident: చెప్పేవి నీతులు.. చేసివి నీచపనులు.. అక్కాచెల్లెళ్లు ఉన్న ఇంటికి వెళ్లి ఈ కానిస్టేబుల్..


  దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో ని ప్రకాశం జిల్లా (Prakasham) పామూరు గ్రామానికి చెందిన యాసారపు మార్తమ్మ నిండు గర్భిణి. ఆమె తన భర్త రమేశ్ తో కలిసి నిజామాబాద్ లో కూలీ పనులు చేసుకొని జీవిస్తోంది. దసరా (Dussehra) పండుగ నేపథ్యంలో ఆమె తన తన్న తల్లి(Mother) ఇంటికి వెళ్తేందుకు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌(Krishna Express) రైలు ఎక్కింది.

  అందులో ఆమె ఖమ్మం రైల్వే స్టేషన్(Khammam Railway Station) వరకు బాగానే ఉంది. బోనకల్లు దగ్గర నుంచి ఆమెకు పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి. మధిర రైల్వే స్టేషన్‌కు వచ్చేసరికి నొప్పులు ఎక్కువ అయ్యాయి.

  Cab Driver: క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళ.. కోపంతో ఆ డ్రైవర్ ఏ చేశాడో తెలుసా..


  అక్కడే ఆ దంపతులు దిగి బటయకు వస్తుండగా.. ఆమె నొప్పులు భరించలేక కూలబడిపోయింది. స్టేషన్ ఆవరణలోనే మార్తమ్మ కూలబడిపోయింది. విషయం తెలుసుకున్న మధిర రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌రెడ్డి 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఆ అంబులెన్స్ రావాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రావాలి.

  ఆ అంబులెన్స్ వచ్చే సరికి చాలా సమయం పడుతుంది. కానీ ఆ బండి వచ్చేసరికి ఎక్కువగా సమయం పడుతుందనడంతో ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆమెకు నొప్పులు ఇంకా ఎక్కువగా మొదలయ్యాయి. దీంతో వేణుగోపాల్‌రెడ్డి చేసేది లేక స్థానికంగా స్వచ్ఛంద సేవ చేసే మధిర రెస్క్యూ టీం రామకృష్ణకు సమాచారం ఇచ్చారు.

  School Girl: పాఠశాలకు వెళ్తున్న బాలికను కారులో ఎక్కించుకున్నారు.. చివరకు నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లి..


  వెంటనే విషయం తెలిసుకొని అతడు తన భార్య జ్యతితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో స్టేషన్ కు సమీపంలో ఓ మార్కెట్ ఉంది. అక్కడకు కూరగాయలు కొనడానికి వచ్చిన 108 ఉద్యోగి గజ్జలకొండ శివ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా అక్కడే మహిళా పారిశుధ్మ కార్మికులు కూడా ఉన్నారు.

  అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ.. ఆమె దుప్పట్లు పట్టుకుని నిల్చోగా.. ఆరుబయటే ఆమెకు సాధారణ కాన్పు చేశారు. మార్తమ్మ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రామకృష్ణ దంపతులు కారులో ఆమెను తీసుకెళ్లి మధిర ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యసిబ్బంది తెలిపారు. అక్కడ సహాయం చేసిన ప్రతీ ఒక్కరికి మార్తమ్మ, ఆమె భర్త రామేశ్ ధన్యవాదాలు తెలియజేశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటంతో రమేష్ సంతోషం వ్యక్తం చేశాడు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Khammam, Madhira, Telangana

  ఉత్తమ కథలు