• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • KHAMMAM HUSBAND COMMITS SUICIDE AFTER KILLING WIFE DUE TO SHE READY TO GO TO AMERICA EVEN HE REFUSED IT HSN

వీడిన మిస్టరీ.. వద్దన్నా వినకుండా అమెరికాకు వెళ్లేందుకు టికెట్ కొన్న భార్య.. ఆ విషయం భర్తకు తెలిసి..

వీడిన మిస్టరీ.. వద్దన్నా వినకుండా అమెరికాకు వెళ్లేందుకు టికెట్ కొన్న భార్య.. ఆ విషయం భర్తకు తెలిసి..

వృద్ధ దంపతుల ఫైల్ ఫొటోోలు

ఖమ్మం జిల్లాలో జరిగిన జరిగిన జంట మరణాల కేసులో మిస్టరీ వీడింది. 65 ఏళ్ల వయసున్న భర్త, తన 60 ఏళ్ల భార్యను ఎందుకు చంపాడన్నది కారణం తెలిసింది. క్షణికావేశమే కాకుండా, భార్య తన మాట వినడం లేదన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని

  • Share this:
    ఖమ్మం జిల్లాలో జరిగిన జరిగిన జంట మరణాల కేసులో మిస్టరీ వీడింది. 65 ఏళ్ల వయసున్న భర్త, తన 60 ఏళ్ల భార్యను ఎందుకు చంపాడన్నది కారణం తెలిసింది. క్షణికావేశమే కాకుండా, భార్య తన మాట వినడం లేదన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడయింది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం రంగం బజార్ కు చెందిన సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వర రావుకు 65 ఏళ్ల వయసు. తన 60 ఏళ్ల భార్య విజయలక్ష్మితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె కుమార్తె రామగుండంలో ఉద్యోగం చేస్తోంది. రెండో అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడు కూతుళ్లను చూసి వస్తుంటారు. పదేళ్ల క్రితం అమెరికాలో ఉన్న చిన్న కుమార్తెను చూసేందుకు వెళ్లి వచ్చారు.

    ఇటీవల చిన్నకూతురు మళ్లీ ఫోన్ చేసి తల్లిదండ్రులిద్దరినీ అమెరికాకు రమ్మని కోరింది. తన కూతురిని చూడాలనిపిస్తోందనీ, అమెరికాకు వెళ్దామని విజయలక్ష్మి తన భర్త సుబ్రహ్మణ్యేశ్వరరావుకు చెప్పింది. అయితే భర్త దానికి ఒప్పుకోలేదు. వద్దన్నాడు. అయినప్పటికీ వినని విజయలక్ష్మి తనకు ఒక్కదానికే ఫిబ్రవరి 15న అమెరికాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంది. ఇది తెలిసిన భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆమెను చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. పక్కా ప్లాన్ తో మంగళవారం రాత్రి ఆమె నిద్రపోతుండగా దాడి చేశాడు. కత్తితో దాడి చేసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు.

    ఉదయం పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి ఎన్ని సార్లు పిలిచినా ఇంట్లో నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూస్తే హాల్ లో సుబ్రహ్మణ్యేశ్వర రావు నోట్లో నుంచి నురగలు వస్తూ అపస్మారక స్థితిలో కనిపించాడు. బెడ్రూంలో మంచంపై విజయలక్ష్మి మృతదేహం పడి ఉంది. ఈ విషయాన్ని వెంటనే స్థానికులకు చెప్పి పోలీసులకు సమాచారం అందిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చాడు. కొనఊపిరితో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరరావును ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. కూతుళ్లిద్దరికీ ఫోన్లు చేసి విషయాన్ని తెలిపారు. వాళ్లు అందించిన సమాచారాన్ని బట్టి తాను వద్దన్నా అమెరికాకు ప్రయాణమవుతున్నందునే భార్యను అతడు చంపాడన్న నిర్ధారణకు వచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు