హోమ్ /వార్తలు /క్రైమ్ /

Khammam: కన్న కూతురుపై తండ్రి అత్యాచారం -ఏళ్లపాటు సాగిన దాష్టీకం -చివరికి కోర్టు ఏం తేల్చిందంటే..

Khammam: కన్న కూతురుపై తండ్రి అత్యాచారం -ఏళ్లపాటు సాగిన దాష్టీకం -చివరికి కోర్టు ఏం తేల్చిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురుపైనే లైంగికదాడికి పాల్పడి, ఆమెను బెదిరిస్తూ కొన్నేళ్లపాటు పాడుపనిచేసి, తప్పించుకుని వెళ్లినా వెంటాడిమరీ పదే పదే దారుణానికి ఒడిగట్టిన ఓ కీచక తండ్రికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నేరానికి సంబంధించి ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు పక్కాగా ఉన్నా, న్యాయం కోసం బాధితురాలు చేసిన సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించింది..

ఇంకా చదవండి ...

సభ్యసమాజం తలదించుకునేలా సొంత బిడ్డపైనే అకృత్యానికి ఒడిగట్టడమే కాకుండా ఏళ్లపాటు ఆమెను వెంటాడుతూ లైంగికదాడి చేసిన తండ్రికి ఎట్టకేలకు శిక్ష పడింది. హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో సంబంధమున్న ఈ కేసులో ఖమ్మం ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర్‌ప్రసాద్‌ తాజాగా సంచలన తీర్పు వెలువరించారు. దాష్టీకం జరిగిన తీరును పోలీసులు నిరూపించడంతో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

హైదరాబాద్‌లోని బాలాజీకాలనీ బోడుఉప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి (ప్రస్తుతం 47 సంవత్సరాలు)కి భార్యా, కూతురు, కొడుకు ఉన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన అతను.. 2014 సమయంలో తన కన్న కూతురి (ప్రస్తుతం 22 ఏళ్లు)ని శారీరంగా ఇబ్బందులకు గురి చేశాడు. దాష్టీకాన్ని బయటికి చెప్పుకోలేని ఆమె అసహాయతను అసులుగా తీసుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెబితే ఆమెతోపాటు తల్లి, తమ్ముణ్ని చంపేస్తానని బెదించేవాడు. ఒక దశలో..

Jr NTR మనసు మార్చే ప్రయత్నం? -చర్చలకు వెళ్లింది ఎవరో తెలుసా? -చంద్రబాబు మంతనాలపై లోకేశ్ అలక!


తండ్రి చేస్తోన్న అఘాయిత్యానికి తట్టుకోలేకపోయిన ఆ కూతురు హైదరాబాద్ లోని ఇంటిని వదిలేసి తన అమ్మమ్మ ఊరైన పాల్వంచ (భద్రాద్రికొత్తగూడెంజిల్లా)కు వెళ్లిపోయింది. అయినాసరే కూతుర్ని వెంటాడుతూ వెళ్లిన కీచక తండ్రి అక్కడ కూడా ఆమెను వేధించాడు. జరిగిన విషయాలపై మాట్లాడుకుందామని నమ్మబలికి.. వాకింగ్ కు వెళుతున్నామని ఇంట్లో చెప్పి కూతుర్ని బయటికి తీసుకెళ్లి నిర్మానుష్యప్రాంతంలో మరోసారి అత్యాచారం చేశాడు. తండ్రికి ఇక ఏమాత్రమూ భరించలేని దశలో ఆ యువతి తాను ఎదుర్కొంటున్న ఘోరాన్ని అమ్మమ్మకు చెప్పేసింది. దీంతో..

ఉపరాష్ట్రపతిగా KCR అసలు కథ ఇదే -ఓడిపోతే దుప్పటి కప్పుకోవాలా? Huzurabad చాలా చిన్న ఎన్నిక: మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు


అమ్మమ్మ అండతో పాల్వంచ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తండ్రిపై ఫిర్యాదు చేసింది.  అప్పటికి బాదితురాలు మైనర్ కావడంతో పోక్సో, లైంగికదాడి సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. పోలీసులు సమర్పించిన ఆధారాలు, వాదనలతో ఏకీభవించిన జడ్జి సోమవారం తీర్పు ప్రకటించారు. కీచక తండ్రికి 20సంవత్సరాలు జైలుశిక్ష, పదివేలు జరిమాన విధించారు.

Published by:Madhu Kota
First published:

Tags: Khammam, Posco case, Rape case

ఉత్తమ కథలు