KGF Inspired Teen Killed Security Guards : ఇటీవలి కాలంలో సినిమాల ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటుంది. సినిమాల్లో హీరోలు చేసినట్లుగానే నిజజీవితంలో చేయాలని చాలామంది అనుకుంటున్నారు. దీంతో అక్కడక్కడా నేరాలకు కూడా పాల్పడుతున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్(KGF) సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నటించిన అనేకమంది నటులు కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమా రెండు సిరీస్‌లు కూడా అద్భుతంగా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను చూసి 19 ఏళ్ల యువకుడు సీరియల్ కిల్లర్ గా మారిపోయాడు. పాపులారిటీ కోసం హత్యలు(Murders) చేయడం మొదలెట్టాడు. అతడి టార్గెట్స్ తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
అసలేం జరిగింది
మధ్యప్రదేశ్(Madhyapradesh) రాష్ట్రంలోని సాగర్ కు చెందిన శివప్రసాద్ (19)కు సినిమాల పిచ్చి. విపరీతంగా సినిమాలు చూసేవాడు. అయితే కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా చూసి స్ఫూర్తి పొందిన శివప్రసాద్.. సినిమాలో మాదిరిగానే నేరాలు చేస్తూ ఫేమస్ అయిపోవాలని అనుకున్నాడు. . నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులే లక్ష్యంగా దారుణమైన హత్యలకు పాల్పడడం మొదలుపెట్టాడు. సాగర్ నగరంలో మూడు రాత్రుల్లో వరుసగా ముగ్గురు సెక్యూరిటీ గార్డులను శివ హతమార్చాడు. గతరాత్రి భోపాల్‌లో ఓ మార్బుల్ షాపు దగ్గర కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు సోను వర్మపై (23) మార్బుల్ రాయితో దాడిచేసి హతమార్చాడు. అనంతరం సెక్యూరిటీ గార్డు జేబులోని సెల్ ఫోని తీసుకొని పరారయ్యాడు శివప్రసాద్.
Teachers Day : ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం..ఏపీలో టీచర్స్ డే బహిష్కరణ
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దగ్గర్లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు..విచారణలో అతడు చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. సెక్యూరిటీ గార్డుల తర్వాత పోలీసులే లక్ష్యంగా తన దాడులు కొనసాగించాలనుకున్నట్లు శివ విచారణలో చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. శివప్రసాద్ పై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, KGF, Madhyapradesh, Man arrested