ఏడాది పాటు ఫ్రీగా కేఎఫ్‌సీ చికెన్ తిన్నాడు.. అది తెలిసిన కంపెనీ లబోదిబోమంటూ..

KFC: దక్షిణాఫ్రికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఖ్వాజులు-నాటల్‌లో చదువుతున్న ఓ విద్యార్థి(27).. ఓ రోజు కేఎఫ్‌సీ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడరని తెలుసుకొన్నాడు.


Updated: May 14, 2019, 2:08 PM IST
ఏడాది పాటు ఫ్రీగా కేఎఫ్‌సీ చికెన్ తిన్నాడు.. అది తెలిసిన కంపెనీ లబోదిబోమంటూ..
కేఎఫ్‌సీ ట్విట్టర్ ఫోటో
  • Share this:
కేఎఫ్‌సీ.. ఈ పేరు వినగానే చికెన్ ప్రియులకు నోరూరుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్‌సీ ఫుడ్‌కు చాలా క్రేజ్ ఉంది. ఈ టేస్టే వేరబ్బా.. ఏయే మసాలాలు కలుపుతాడో గానీ.. ఆహా! రుచి అంటుంటారు. స్పైసీగా ఉండే ఈ ఫుడ్ అంటే.. ఇష్టపడని వారుండరు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చెందిన మొదటి వ్యాపార సంస్థగా కేఎఫ్‌సీ పేరు తెచ్చుకున్నది. ఈ వంటకం పుట్టుక దగ్గర్నుంచి రుచి వరకూ అన్నీ ఆశ్చర్యపరిచే విషయాలే. అయితే, ఆ కంపెనీకి దిమ్మదిరిగే షాక్‌కు గురిచేసే పని చేశాడో యువకుడు. దక్షిణాఫ్రికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఖ్వాజులు-నాటల్‌లో చదువుతున్న ఓ విద్యార్థి(27).. ఓ రోజు కేఎఫ్‌సీ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడరని తెలుసుకొన్నాడు. డబ్బు పెట్టకుండా ఎలా తినొచ్చా.. అని ఆలోచించి ఓ పథకం వేశాడు. తానే కేఎఫ్‌సీ ఉద్యోగి అవతారం ఎత్తాడు. తాను కేఎఫ్‌సీ హెడ్‌క్వార్టర్స్ నుంచి వచ్చానని, ఫుట్ క్వాలిటీ‌ చెక్ చేయాలని సిబ్బందిని పిలిచాడు.

వెంటనే అక్కడున్న సిబ్బంది అతడు చెప్పినట్లు కొన్ని వెరైటీలు తీసుకొచ్చి అతడి ముందు పెట్టారు. వాటిని కడుపునిండా లాగించేసి వెళ్లిపోయేవాడు. అలా వేర్వేరు చోట్ల ఉన్న కేఎఫ్‌సీ రెస్టారెంట్లన్నింటిలో తినేవాడు. అవి పూర్తవగానే మళ్లీ మొదటి రెస్టారెంట్‌కు వెళ్లేవాడు. అలా ప్రతీ రోజు ఏడాది పాటు బొజ్జ నింపుకున్నాడు. అయితే, ఈ విషయం బయటపడటంతో దొరికిపోయాడు. ఒక రోజు అలాగే చెకింగ్ అని వెళ్లగా నిర్వాహకుడు ఆ యువకుడిని పోలీసులకు అప్పగించాడు.

కాగా, ఓ జర్నలిస్టు దీనికి సంబంధించిన వార్తను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగానే దాదాపు 4వేల మంది రీట్వీట్లు, 7వేల లైకులతో హోరెత్తించారు. ఆ విద్యార్థికి నీరాజనాలు పలుకుతున్నారు నెటిజన్లు. కేఎఫ్‌సీ సిబ్బందిని ఈజీగా ఫూల్ చేశాడని, అతడో లెజెండ్ అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
First published: May 14, 2019, 2:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading