హోమ్ /వార్తలు /క్రైమ్ /

హాయిగా సాగిపోతున్న సంసారం.. ఆరేళ్ల కూతురిని విడిచి పెట్టి ఈ తల్లి ఏం చేసిందంటే..

హాయిగా సాగిపోతున్న సంసారం.. ఆరేళ్ల కూతురిని విడిచి పెట్టి ఈ తల్లి ఏం చేసిందంటే..

షమ్నా

షమ్నా

మడవూర్‌కు చెందిన షమ్మాకు భర్త, ఆరేళ్ల కూతురు ఉన్నారు. అయితే ఆమె భర్త గల్ఫ్‌లో పనిచేసేవాడు.

ఓ మహిళ తన ఆరేళ్ల కూతరుని విడిచిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆ మహిళ.. ఆమె భర్త స్నేహితుడితో కలిసి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. రెండేళ్ల తర్వాత వారిద్దరిని పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కేరళలో(Kerala) చోటుచేసుకుంది. వివరాలు.. మడవూర్‌కు చెందిన షమ్మాకు భర్త, ఆరేళ్ల కూతురు ఉన్నారు. అయితే ఆమె భర్త గల్ఫ్‌లో(Gulf) పనిచేసేవాడు. అయితే గల్ఫ్‌లో అతని‌తో పాటు పనిచేస్తున్న.. నిజాంతో షమ్నాకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నిజాం, షమ్నాలు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. దీంతో ఇద్దరు మధ్య చనువు మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే ఇండియాకు(India) వచ్చిన నిజాం.. షమ్మాతో కలిసి పారిపోయాడు. ఇదంతా 2019లో జరిగింది.

ఇక, 2019 మే 12న షమ్నా కనిపించడం లేదని పల్లిక్కల్(Pallickal) పోలీస్ స్టేష‌న్‌లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నిజాంతో కలిసి షమ్నా పారిపోయినట్టుగా తేలింది. మే నెలలో ఇండియాకు తిరిగి వచ్చిన నిజాం.. షమ్నాతో కలిసి పారిపోయినట్టుగా (Elope)పోలీసులు గుర్తించారు. అయితే వారు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బంధువులు, స్నేహితులతో కాంటాక్ట్‌లో లేకుండా చూసుకున్నారు. దీంతో వారు ఏ ప్రాంతంలో ఉన్నారనేది గుర్తించడం కష్టంగా మారింది.

Mystery: క్యాన్సర్‌తో భార్య మృతి.. ఇల్లు క్లీన్ చేస్తుండగా భర్తకు కనిపించిన షాకింగ్ సీన్.. వాటి వెనక ఉన్న మిస్టరీ ఏమిటి..?


మరోవైపు ఈ సమయంలో నిజాం, షమ్నాలు తమిళనాడు (Tamil Nadu)లో ఉన్నారు. నిత్యం ఇళ్లు మారేవారు. వీరు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండేవారు. అలాగే చుట్టుపక్కల వారితో సంబంధాలు పెట్టుకునేవారు కాదు. అయితే ఇటీవల తమిళనాడులోని కొయంబత్తూరులోని ఇంటిని ఖాళీ చేసిన వీరు.. కేరళలోని ఒట్టపాలం పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ అద్దె ఇంటికి మారారు.

Shocking: అతడి వయసు 64, ఆమె వయసు 55.. ఏ భర్త చేయకూడని విధంగా..

Sad: అయ్యో పాపం.. ఆమె ఎనిమిది నెలల గర్భిణి.. కన్నవారికి కన్నీటిని మిగిల్చి..


దీంతో వారి ఆచూకీ పోలీసులకు తెలిసింది. ఒట్టపాలం పోలీసుల సహాయంతో పల్లిక్కల్ పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం నిజాం, షమ్నాలను అట్టింగల్ కోర్టులో (Attingal Court) హాజరుపరిచారు. ఇక, వివాహేతర సంబంధాల కారణంగా కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ కేసుల సంఖ్యగా ఎక్కువగా ఉంటుంది. వివాహేతర సంబంధాలు వారి కాపురాలనే కాకుండా, భవిష్యత్తును అంధకారంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా వారి పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

First published:

Tags: Crime news, Extramarital affairs, Kerala