హోమ్ /వార్తలు /క్రైమ్ /

కలిసి చదివే సమయంలో ప్రేమించుకున్నారు.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. కానీ కొద్ది రోజులకే ఊహించని ఘటన..

కలిసి చదివే సమయంలో ప్రేమించుకున్నారు.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. కానీ కొద్ది రోజులకే ఊహించని ఘటన..

కృష్ణ‌ప్రభ, శివరాజ్

కృష్ణ‌ప్రభ, శివరాజ్

వారిద్దరు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకటిగా కలిసి జీవించాలని భావించారు. పెళ్లి చేసుకున్నారు.

వారిద్దరు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకటిగా కలిసి జీవించాలని భావించారు. పెళ్లి చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా యువతి.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని త్రిసూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. త్రిసూర్ జిల్లాలోకు చెందిన కృష్ణప్రభ.. శివరాజ్ కలిసి చదువుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత శివరాజన్, కృష్ణ‌ప్రభ పాలక్కాడ్‌ జిల్లాలోని తిరుమితకోడ్ వరవత్తూరులోని మన్నెంకోట్ కాంపౌండ్‌లో నివసిస్తున్నారు. అయితే కృష్ణప్రభ.. ఈ నెల 14న తన భర్త ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోని గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే పెళ్లి తర్వాత కృష్ణ ప్రభ కట్నం తీసుకురాకపోవడంతో.. భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ ప్రభ చనిపోవడానికి శివరాజ్, అతని కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిచారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకు వరకట్నం తేవాలని కృష్ణప్రభను ఆమె భర్త, అత్తింటివారు మానసికంగా, శారీరకంగా హింసించారని చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి కృష్ణ ప్రభ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుందని చెప్పారు. త్వరలోనే శివరాజ్‌ను, అతని కుటుంబ సభ్యులను విచారించనున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇక, కేరళలో గత మూడేళ్ల కాలంలో వరకట్న వేధింపుల కారణంగా 34 మంది మృతిచెందినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి.

First published:

Tags: Crime news, Dowry harassment, Kerala

ఉత్తమ కథలు