సీపీఎం ఆఫీసులో యువతిపై రేప్...ఎన్నికలవేళ కేరళలో దుమారం

10 నెలల క్రితం సీపీఎం ఆఫీసులో తనపై రేప్ జరిగిందని..కాలేజీ మ్యాగజైన్ పని మీద అక్కడికి వెళ్లగా ఓ విద్యార్థి సంఘం నేత తనపై అత్యాచారం చేశారని బాధితురాలు వెల్లడించింది. ఆమె వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 8:23 PM IST
సీపీఎం ఆఫీసులో యువతిపై రేప్...ఎన్నికలవేళ కేరళలో దుమారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లోక్‌సభ ఎన్నికలవేళ కేరళలో అధికార సీపీఎం పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. సీపీఎం కార్యాలయంలో తనను విద్యార్థి సంఘం నేత రేప్ చేశాడని ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. పాలక్కడ్ జిల్లా చెరుప్లాసరీ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఈ దారుణం జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంది. 10 నెలల క్రితం ఈ ఘటన జరిగిందని..రేపిస్ట్ పాపానికి తనకు బిడ్డ జన్మించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల వేళ ఈ వ్యవహారం కేరళ రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది.

శనివారం రాత్రి రోడ్డుపక్కన అప్పుడే పుట్టిన శిశువును స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శిశువును శిశుసంరక్షణా కేంద్రానికి తరలించారు. ఎట్టకేలకు చిన్నారి తల్లిని గుర్తించిన పోలీసులు..అసలు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. విచారణలో సంచలన విషయాలను వెల్లడించింది ఆ మహిళ. 10 నెలల క్రితం సీపీఎం ఆఫీసులో తనపై రేప్ జరిగిందని..కాలేజీ మ్యాగజైన్ పని మీద అక్కడికి వెళ్లగా ఓ విద్యార్థి సంఘం నేత అత్యాచారం చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఆమె వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అధికార సీపీఎం పార్టీపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. LDF పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిపడుతున్నారు. సాక్షాత్తు పార్టీ కార్యాలయంలోనే రేప్‌లు జరుగుతున్నాయంటే వామక్షాల పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధంచేసుకోవచ్చని విమర్శలు గుప్పిస్తున్నారు.

సీపీఎం ఆఫీసులో అత్యాచార ఘటనను నిరసిస్తూ చెరుప్లాసరీలో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేపిస్ట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐతే ఘటనపై పూర్తిస్థాయిలో విచారణచేసి నిజాలను బహిర్గతం చేయాలన్నారు సీపీఎం ఎంపీ ఎంబీ రాజేశ్. ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, ప్రస్తుతం బాధితురాలు, శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
First published: March 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading