Home /News /crime /

KERALA TEENAGERS TORTURED MINOR BOY FOR REVEALING THEIR DRUG USAGE TO PARENTS HSN

ఏడుగురు యువకులు చేసిన ఓ పాడు పని గురించి తల్లిదండ్రులకు చెప్పాడని.. ఆ బాలుడికి నరకం చూపెట్టారు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తమ నిర్వాకం గురించి ఇంట్లో తెలిసిపోయిందన్న కోపంతో ఆ బాలుడిపై టీనేజర్లు తమ ప్రతాపాన్ని చూపించారు. ఆ బాలుడికి నరకం చూపించారు. పైగా దాన్ని వీడియో తీసుకున్నారు కూడా. ఆ వీడియో కాస్తా బయటకు పొక్కడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
    చేతులను కట్టేశారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశారు. మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ అడిగించారు. బెల్టు తీసుకుని బాదారు. నానా రకాలుగా నరకం చూపించారు. ఇంతకీ అతడు చేసిన నేరమేంటో తెలుసా..? కొందరు యువకులు డ్రగ్స్ వాడుతున్నారని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పడమే అతడు చేసిన పాపం. తాము డ్రగ్స్ వాడుతున్నట్టు ఇంట్లో తెలిసిపోయిందన్న కోపంతో ఆ బాలుడిపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఆ బాలుడిని పట్టుకుని, నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకొచ్చి నరకం చూపించారు. పైగా దాన్ని వీడియో తీసుకున్నారు కూడా. ఆ వీడియో కాస్తా బయటకు పొక్కడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. చివరకు వారందరిపై కేసు నమోదుచేసే దాకా వెళ్లింది. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

    కేరళ రాష్ట్రంలోని కలమస్సెరీ ప్రాంతంలో కొందరు యువకులు డ్రగ్స్ తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. వారు డ్రగ్స్ తీసుకుంటుండగా ఓ మైనర్ బాలుడు చూశాడు. దీంతో ఆ యువకుల తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. ఈ విషయమై ఆ యువకులను తల్లిదండ్రులు నిలదీసి కొట్టినంత పనిచేశారు. ఆ మైనర్ బాలుడి వల్లే తమ గురించి విషయం తెలిసిందనీ ఆ యువకులు గ్రహించారు. ఆ బాలుడిపై ఆగ్రహం పెంచుకున్నారు. సమయం చూసి ఆ బాలుడిని పట్టుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. చిత్రహింసలు పెట్టారు. దుస్తులు విప్పదీసి కొట్టారు. మోకాళ్లపై నిలబెట్టి ప్రతీ ఒక్కరి కాళ్ల మీద పడి క్షమించమని కోరమన్నారు. రక్తం వచ్చేలా బాదారు. దీన్ని వీడియో కూడా తీసుకున్నారు.

    ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే సుమోటోగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆ యువకులను అరెస్ట్ చేశారు. కలమస్సెరీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఉన్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. మొత్తం ఏడుగురు గ్రూపు కాగా, వారిలో ఒక్కరు మాత్రమే 18ఏళ్ల వయసును కలిగి ఉన్నారు. మిగిలిన వాళ్లంతా 14 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు మధ్య వారేనని పోలీసుల విచారణలో తేలింది. బాధిత మైనర్ బాలుడు కూడా 14ఏళ్ల వయసు కలిగిన వాడేనని తెలిసింది. దీంతో 18ఏళ్ల బాలుడిపై కేసు నమోదు చేసి, మిగిలిన ఆరుగురు బాలురను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచామని పోలీసులు తెలిపారు. కాగా, బాధిత బాలుడికి న్యాయం చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు