హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: ఆన్‌లైన్‌ ఫ్రెండ్ కోసం 300 కిలోమీటర్ల ప్రయాణం.. మద్యం, డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

Shocking: ఆన్‌లైన్‌ ఫ్రెండ్ కోసం 300 కిలోమీటర్ల ప్రయాణం.. మద్యం, డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gang rape: కేరళలో దారుణం జరిగింది. ఆన్ లైన్ ఫ్రెండ్ చెప్పిన మాటలు నమ్మి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన వెళ్లిన యువతి గ్యాంగ్ రేప్ కు గురైంది. అది కూడా అత్యంత దారుణంగా..

Kerala Shocker: సామాజిక మాధ్యమాల్లో  పరిచయాలు  (Social Media Friendship) ప్రాణాలు తీస్తున్నాయి. సామాజిక మద్యం వాడకం  పెరిగిన తరువాత మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా మహిళలు బలి అవుతున్నారు. తాజాగా కేరళలో అంత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతికి రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఆన్ లైన్ లో పరిచయం అయ్యాడు. రోజు ప్రేమగా మాటలు చెప్పేవాడు. తన దగ్గరకు వచ్చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నమ్మించాడు. తను లేకుండా ఉండలేను అంటూ మాయమాటలు చెప్పాడు. ఒక్కసారి చూడాలి అని ఉంది రావాలని కోరాడు.. చూడకపోతే ఉండలేను అంటూ బలవంతం పెట్టాడు. దీంతో తనకు ఆన్‌లైన్‌లో పరిచయమైన (Online Friendship) వ్యక్తిని నమ్మి ఏకంగా ఆ యువతి 300 కిలోమీటర్ల దూరం వెళ్లింది. అసలు అతడు ఎవరో తెలియకపోయిన.. ఆన్ లైన్ లో అతడు చెప్పిన మాటలు నమ్మేసింది. గుడ్డిగా అక్కడకు వెళ్లింది. కానీ అక్కడికి వెళ్లిన తరువాత సామూహిక అత్యాచారానికి (Woman gang-raped in Kerala) గురైంది. యువతికి మాయ మాటలు చెప్పి నమ్మించిన యువకుడు అక్కడికి వెళ్లాక.. తన అసలు రూపం బయట పెట్టాడు.. ఆమె వస్తుందని ముందే తెలియడంతో స్నేహితులను పిలిపించి మాటు వేశాడు. తన కోసం సాహసం చేసి వచ్చిన యువతిపై తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కేరళలోని కొల్లాంకు చెందిని ఓ యువతి దాదాపు రెండేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో కోజికోడ్‌కు చెందిన అనాస్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారడంతో అప్పటి నుంచి తరచూ వారు ఫోన్‌ ద్వారా మాట్లాడుకోవడం, మెసేజ్‌లు చేసుకుంటున్నారు. ఇటీవల అనాస్‌ ఆ యువతిని కోజికోడ్‌కి రావాలని బలవంతంగా చేయగా అందుకు తను అంగీకరించింది. దీంతో కొల్లాం నుంచి అంటే 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి (Kerala woman travels 300km) గురువారం అక్కడుకు చేరుకుంది. అక్కడ ఆమెను రిసీవ్ చేసుకున్న ఆనాస్ ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. తరువాత ఆ ఫ్లాట్‌కి అతని ముగ్గురు స్నేహితులు కూడా వచ్చారు.

ఇదీ చదవండి: నేడు నీట్‌ ఎంట్రెన్స్ టెస్ట్.. పరీక్షలో స్వల్ప మార్పులు.. కొత్త గైడ్​లైన్స్ ఇవే.. విద్యార్థులకు అలర్ట్

వీళ్లంతా ఎవరు అని ప్రశ్నిస్తే.. తన ప్రాణ స్నేహితులని పరిచయం చేశాడు. వాళ్లకు పరిచయం చేయడానికి పిలిపించానని నమ్మించాడు. తరువాత చిన్న పార్టీ అంటూ మొదట ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె కాస్త మత్తులోకి వెళ్లిన తరువాత డ్రగ్స్ కూడా ఇచ్చారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు.

ఇదీ చదవండి: వార ఫలాలు.. అన్ని విధాలా కలిసివచ్చే కాలం.. కొత్త పరిచయాలతో లాభం

వారి రాక్షస ఆనందానికి సాక్ష్యం అన్నట్టు.. ఆ దృశ్యాలను పోన్ లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కాసేపటి తరువాత యువతి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని గ్రహించి వారు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రి సమీపంలో వదిలేశారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. అయితే ఆస్పత్రి సిబ్బంది యువతిపై జరిగిన దారుణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధిత మహిళ నుంచి స్టేట్‌మెంట్, నిందితుడి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆనాస్‌ను అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. అయితే ఇలా ఆన్ లైన్ లో తెలియని వ్యక్తులతో పరిచయాలు మంచివి కాదని.. అన్నీ నిర్ధారించుకున్న తరువాత స్నేహం చేయాలని పోలీసులు పదే పదే చెబుతున్నాయి. అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు.

First published:

Tags: Crime news, Kerala, National News

ఉత్తమ కథలు