Home /News /crime /

KERALA TEACHERS FB POST OPENS FLOOD OF COMPLAINTS STUDENTS ACCUSE HIM OF HARASSMENTS AND ABUSE PAH

Shocking: బయటపడ్డ ఉపాధ్యాయుడి నిర్వాకం.. 38 ఏళ్లుగా బాలికలపై లైంగిక దాడి.. 

కేవీ శశికుమార్ (ఫైల్)

కేవీ శశికుమార్ (ఫైల్)

Kerala: విద్యార్థులకు సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిలా మారాడు. అభం శుభం తెలియని బాలికలపై మూడు దశాబ్దాలపాటు వేధింపులకు పాల్పడ్డాడు.

సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోనికి వచ్చింది. విద్యార్థులకు సరైన చదువు, మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే (Teacher) వారి పాలిన కీచకుడిలా మారాడు. బాలికలకు మాయమాటలు చెప్పి వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవాడు. కొందరికైతే.. అసలు ఉపాధ్యాయుడి చేష్టలు అర్థం కాని వయస్సు వారిది. అలాంటి వారిపట్ల కూడా నీచంగా ప్రవర్తించేవాడు. అతగాడు రిటైర్డ్ అయ్యాక.. అతని బాగోతాలు వెలుగులోనికి వచ్చాయి.

పూర్తి వివరాలు.. కేరళలో  (Kerala) అమానుష సంఘటన జరిగింది. మలప్పురంలోని స్థానిక బాలికల పాఠశాలలో కేవీ శశికుమార్ (Sasikumar) ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతను మార్చి 31 న పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత తన 38 ఏళ్ళ సర్వీసును గుర్తు చేసుకుంటు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. దీంతో అదే పాఠశాలలోని పూర్వ విద్యార్థులు దీనిపై స్పందించారు. తమను ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ పోస్ట్ లు పెట్టారు. ప్రధానంగా, బీనా పిళ్లై, మిని సకీర్ లు ఇతనిపై ఆరోపణలు గుప్పించారు. తమను ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడని, అమాయక బాలికలను వేధించాడని ఆరోపించారు. దీంతో ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.

మరికొంత మంది విద్యార్థినులు కూడా ముందుకు వచ్చి ఉపాధ్యాయుడి బాగోతాన్ని బైటపెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా,నిందితుడు మలప్పురానికి మూడు సార్లు కౌన్సిలర్ గా కూడా పనిచేశాడు. ఘటన వెలుగులోనికి రావడంలో కేవీ శశికుమార్ ను సీపీఐ(ఎం) పార్టీ నుంచి సస్సెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 25 మంది బాలికలను ప్రత్యేకంగా విచారించారు. వీరి విచారణలో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. ఉపాధ్యాయుడి వేషంలో కేవీ శశికుమార్, బాలికలపై క్లాసులోనే దారుణాలకు పాల్పడేవాడని పలువురు తెలిపారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

రాజస్థాన్ లో (Rajasthan)  అమానుషం చోటు చేసుకుంది.

12 బాలిక తన తల్లితో పాటు తాత దగ్గర ఉంటుంది. ఆమె తండ్రి 12 ఏళ్ల క్రితమే మరణించాడు. బాలికి తల్లి మానసిక వికలాంగురాలు. ఆమెతో ఎవరితో సరిగ్గా మాట్లాడదు. బాలిక తాత.. తాగుడుకు బానిసయ్యాడు. ఇతను వీరిని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో.. తాత.. మరో ఇద్దరితో కలిసి ఇంట్లోనే బాలికపై అత్యాచారానికి (Rapes girl)  పాల్పడేవారు. నెలల తరబడి బాలికపై అఘాయిత్యం జరిపారు. ఈ క్రమంలో బాలిక ఇటీవల పాఠశాలలో అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఆమెను చూసిన వైద్యులు 5 నెలల గర్భవతి (pregnant)అని తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో బాలిక షాకింగ్ విషయాలు (shocking) వెల్లడించింది. తన తాత.. మరో ఇద్దరు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని తెలిపింది. తాత.. స్నేహితుడు రాంలాల్ భీల్ (50), అజయ్ బైర్వా (20), వీరు గత నెలలుగా బెదిరిస్తు.. అఘాయిత్యానికి పాల్పడుతున్నారని బాలిక వాపోయింది. వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వీరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Harassment, Kerala, Minor girl raped, Teacher

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు