Home /News /crime /

KERALA PREGNANT WOMAN AND HUSBAND HELD FOR SMUGGLING 7 KG OF GOLD AT CALICUT AIRPORT AT KARIPUR MKS

Gold smuggling: 5నెలల గర్భం.. మలద్వారంలో బంగారం.. సాఫ్నా సమద్ చేసిన పనికి అంతా షాక్!

నిందితురాలు సాఫ్నా నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం

నిందితురాలు సాఫ్నా నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం

గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే రీతిలో గర్బిణి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన సాఫ్నా అనే మహిళ కడుపులో ఐదు నెలల శిశువును పెట్టుకొని ఆరోగ్యాన్ని పణంగాపెట్టి మలద్వారంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది.

ఇంకా చదవండి ...
బంగారం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటిదాకా చిత్రవిచిత్రమైన కేసులు ఎన్నో చదివుంటాం. కానీ తొలిసారి ఒళ్లు గగుర్పొడిచే రీతిలో గర్బిణి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియాలో మహిళలూ కీలక పాత్రధారులుగా ఉంటోన్న క్రమంలో ప్రైవేటు శరీర భాగాల్లో బంగారాన్ని దాచుకొని కస్టమ్స్ కు దొరికిపోయిన ఉదంతాలు ఆఫ్రికాలో తరచూ జరుగుతుంటాయి. మన దేశంలోనూ ఇటీవల అలాంటి కేసులుపెరుగుతున్నాయి.

అయితే నిజంగా గర్బిణి అయిఉండి అలాంటిపని చేసి అడ్డంగా బుక్కైందో మహిళ. కడుపులో ఐదు నెలల శిశువును పెట్టుకొని ఆరోగ్యాన్ని పణంగాపెట్టి మలద్వారంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన సర్వత్రా సంచలనం రేపింది. వివరాలివే..

Petrol Diesel బంపర్ ఛాన్స్: తక్కువ సమయంలో భారీ లాభాలు పొందే Business Idea ఇది..


గల్ఫ్ దేశాల్లోని రాచరిక ప్రభుత్వాల అలసత్వమో, అక్కడి ఎయిర్ పోర్టుల్లో అధికారుల అవినీతి పరంపరోగానీ అరబ్ దేశాల నుంచి ఇండియాకు బంగారం అక్రమ రవాణా నానాటికీ పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాల్లో గోల్డ్ స్మగ్లర్లు పట్టుపడుతోన్న ఘటనలు దాదాపు అన్ని ఎయిర్ పోర్టుల్లో ప్రతిరోజూ చోటుచేసుకుంటున్నాయి.

నిందితులు సమద్, సాఫ్నా

International Workers Day: నేడు మే డే : ప్రపంచ కార్మిక దినోత్సవం.. పోరాడితే పోయేదేమీ లేదంటూ..


ప్రవాసులు ఎక్కువగా ఉండే కేరళ అయితే గోల్డ్ స్మగ్లింగ్ కు కేరాఫ్ గానూ మారింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ సంబంధిత కేసుల్లో సీఎం, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైనా సంచలన ఆరోపణలున్నాయి. కాగా, కరిపూర్ లోని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం వెలుగు చూసిన కేసు మరింత షాకింగ్ అనిపిస్తుంది..

PM Kisan: రైతులకు డబుల్ బొనాంజా? భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా? నిబంధనలివే..


సౌదీ అరేబియాలోని జెడ్డా సిటీ నుంచి కేరళలోని కాలికట్ విమానాశ్రయంలో ల్యాండైన విమానంలో భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా జరిగింది. ఇద్దరు ప్రయాణికుల నుంచి ఏకంగా 7 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరీ దారుణంగా 5 నెలల గర్బిణి అయిన నిందితురాలు, ఆమె భర్త తమ మలద్వారం, లోదుస్తుల్లో ద్రవరూపంలోని బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు.

కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పేస్ట్ రూపంలోని బంగారం

Prashant Kishor: బీజేపీని ఓడించేది అదొక్కటే: పీకే తాజా వ్యాఖ్యలు -కాబట్టే KCR స్వరంలో మార్పు?


నిందితులను అబ్దుల్ సమద్, అతని భార్య సాఫ్నా సమద్ లను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీస్ రిమాండ్ కు తరలించారు. అమ్మినిక్కడ్​కు చెందిన వీరిద్దరూ సౌదీ నుంచి బంగారాన్ని లిక్విడ్ పేస్ట్ గా మార్చి స్మగ్లింగ్ చేశారు. సాఫ్నా ఐదు నెలల గర్భంతో ఉండి ఇలాంటి పని చేయడం షాకింగ్ గా ఉందని, గర్భవతి కాబట్టి చికిత్స కోసం వెళుతున్నట్లు సులువుగా తప్పించుకోవచ్చనే ఆమె రిస్క్ చేసిందని అధికారులు వ్యాఖ్యానించారు. సాఫ్నా దంపతులు పట్టుకొచ్చిన బంగారం విలువ సుమారు రూ.3.25కోట్లు అని, నిందితులిద్దరినీ అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Gold, Gold smuggling, Kerala

తదుపరి వార్తలు