• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • KERALA POLICE RAID AT RESORT DRUG PARTY ACTRESS BRISTY BISWAS ARRESTED MNJ

Drugs Party: రిసార్ట్‌లో డ్ర‌గ్స్ పార్టీ.. ప్ర‌ముఖ‌ న‌టిని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

Drugs Party: రిసార్ట్‌లో డ్ర‌గ్స్ పార్టీ.. ప్ర‌ముఖ‌ న‌టిని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

కేరళ డ్రగ్స్ పార్టీ

భార‌తీయ సినిమా ఇండ‌స్ట్రీని డ్ర‌గ్స్ కేసులు ఊపేస్తున్నాయి. సుశాంత్(Sushant death) మృతి త‌రువాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కేసు(Bollywood Drugs Case) వెలుగులోకి రాగా.. న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి(Rhea Chakraborthy), ఆమె సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తి స‌హా ప‌లువురిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు

  • Share this:
    Drugs Party: భార‌తీయ సినిమా ఇండ‌స్ట్రీని డ్ర‌గ్స్ కేసులు ఊపేస్తున్నాయి. సుశాంత్ మృతి త‌రువాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కేసు వెలుగులోకి రాగా.. న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తి స‌హా ప‌లువురిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు(వారిలో కొంత‌మంది బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు). అలాగే శ్ర‌ద్ధా క‌పూర్, దీపికా ప‌దుకొణే, క‌ర‌ణ్ జోహార్, అర్జున్ రాంపాల్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ఎన్సీబీ అధికారులు విచారించారు. అంతేకాదు ఇప్పటికీ డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇక హిందీ పరిశ్రమలో డ్రగ్స్ కోణం బయట పడ్డ కొద్ది రోజులకే  ఇటు కన్న‌డ ప‌రిశ్ర‌మ‌లోనూ డ్ర‌గ్స్ కేసు బ‌య‌ట‌ప‌డింది. దీంతో రాణిగి ద్వివేది, సంజ‌నా గల్రానీ సహా ప‌లువురిని సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని, జైలుకు త‌ర‌లించారు. ఇక తాజాగా మాలీవుడ్‌లోనూ డ్ర‌గ్స్ కోణం బ‌య‌ట‌ప‌డింది.

    కేర‌ళ‌లోని ఇడుక్కి జిల్లాలోని ఓ రిసార్ట్‌లో ఇటీవ‌ల డ్ర‌గ్స్ పార్టీ చేసుకుంటుండ‌గా.. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డకు వెళ్లారు. ఈ క్ర‌మంలో పార్టీలో డ్ర‌గ్స్ తీసుకుంటున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో న‌టి బ్రిస్టీ బిశ్వాస్ కూడా ఉన్నారు. మోడ‌లింగ్‌లో మంచి గుర్తింపును పొందిన బ్రిస్టీ.. ప‌లు చిత్రాల్లో కూడా న‌టించారు. ఆమెతో పాటు మ‌రో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ర‌కాల డ్ర‌గ్స్‌ని కూడా పోలీసులు సీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీకి మ‌రింత మంది సెల‌బ్రిటీలు రావాల్సి ఉండేద‌ని.. కానీ ఈ లోపే పోలీసులు రైడ్స్ చేయ‌డం, అది తెలిసిన వారు రాకుండా ముందు జాగ్ర‌త్త ప‌డ‌టం చేశార‌ని స‌మాచారం. మ‌రి పోలీసులు విచార‌ణ‌లో ఎవ‌రి పేర్లు అయినా బ‌య‌ట‌కు వ‌స్తాయేమో చూడాలి.

    Kerala Drugs Case, Police Raid Drugs Party, Drugs Party Kerala, Kerala Actress arrest, Actress Bristy Biswas arrest, బ్రిస్టీ బిశ్వాస్, కేరళ డ్రగ్స్ కేసు
    బ్రిస్టీ బిశ్వాస్


    అయితే అప్పట్లో తెలుగు పరిశ్రమను డ్రగ్స్ కోణం ఓ ఊపు ఊపింది. ఈ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మీ, రవితేజ, ముమైత్ ఖాన్ సహా పలువురు ప్రముఖులను అధికారులు విచారించారు. అయితే ఆ తరువాత వీరందరికీ క్లీన్ చిట్ వచ్చిన విషయం తెలిసిందే.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు