హోమ్ /వార్తలు /క్రైమ్ /

మోసగాడి వల్లో చిక్కిన యువతి.. కేసును తెలివిగా ఛేదించిన పోలీసులు

మోసగాడి వల్లో చిక్కిన యువతి.. కేసును తెలివిగా ఛేదించిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మంచివాళ్లైనా, చెడ్డవాళ్లైనా మన మధ్యే ఉంటారు. వారిని గుర్తించే విషయంలో పొరపాటు జరిగితే జీవితమే ఛిన్నాభిన్నం అయిపోతుంది. ఓ యువతికి ఇదే పరిస్థితి ఎందురైంది. ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అది కేరళలోని.. పతనంతిట్ట. అక్కడ 18 ఏళ్ల ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటోంది. లైక్స్ కోసం.. వచ్చిన ప్రతీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌నీ ఆమోదించింది. ఓ రోజు ఆమెకు మెసేజ్ వచ్చింది. అవతలి నుంచి ఓ వ్యక్తి కూల్‌గా చాట్ చేశాడు. పొగడ్తలతో ముంచెత్తా‌డు. అతని తీరు ఆమెకు బాగా నచ్చింది. అలా ఇద్దరి మధ్యా స్నేహం మొదలైంది. తర్వాత ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఓ రోజు ఇద్దరూ కలిశారు. అతని పేరు సంతోష్. వయసు 43 ఏళ్లు. కానీ ఆమె ముందు కుర్రాడిలా నటించాడు. అమాయకురాలైన ఆ యువతి అతన్ని పూర్తిగా నమ్మింది.

నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. మొదట ఒప్పుకోకపోయినా.. తర్వాత ఆమె ఒప్పుకుంది. అదే అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. తాజాగా నవంబర్ 7, 2022న ఆమె చదువుకోవడానికి అంటూ ఇంట్లోంచీ బయటకు వెళ్లింది. ఆమెను తనతో తీసుకుపోయాడు సంతోష్.

కూతురు ఎంతకీ రాకపోవడంతో.. ఆమె తల్లి.. పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆమె కాల్ డేటా. సోషల్ మీడియా డేటాను పరిశీలించారు. తద్వారా సంతోష్ అనే వ్యక్తితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతోందని గ్రహించారు. సంతోష్‌కి కాల్ చెయ్యగా.. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఆమె మొబైల్ కూడా స్విచ్ఛాఫ్ ఉంది. దాంతో పోలీసులు.. రెండు ఫోన్లనూ ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో సంతోష్ ఫోన్ ఆన్ చెయ్యడంతో.. పోలీసులకు తెలిసింది, వెంటనే సంతోష్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి.. సెర్చ్ చెయ్యడంతో.. ఆ ఇంట్లో సంతోష్, బాధితురాలు కనిపించారు.

Gut Health : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. కడుపులో ఏదో తేడా అవుతున్నట్లే..

సంతోష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని మొబైల్‌ని సీజ్ చేశారు. అలాగే.. బాధితురాలి స్టేట్‌మెంట్ నమోదుచేశారు. దాని ప్రకారం.. సంతోష్.. ఎలా సంపాదించాడో గానీ.. బాధితురాలి సెక్సీ ఫొటోని ఆమె మొబైల్ నుంచి సేకరించాడు. దానితో బ్లాక్ మెయిల్ చేశాడు. తనతో రాకపోతే.. ఆ ఫొటోని వాట్సాప్ గ్రూపుల్లో పెడతానని బెదిరించాడు. దాంతో ఆమె అతనితో వెళ్లింది. ఆమెను అళప్పుజా లోని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లిన సంతోష్.. లైంగికంగా వేధించా‌డనీ, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆమె పోలీసులకు తెలిపింది.

Winter Food : చలికాలంలో చేపలు ఎక్కువగా తినాలి.. ఎందుకో తెలుసా?

బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపిన కోయిప్రమ్ పోలీసులు.. కన్నూర్‌కి చెందిన సంతోష్‌కి ఆల్రెడీ పెళ్లైందనీ, ఓ పిల్లాడు కూ‌డా ఉన్నాడని తెలిపారు. పూర్తి దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

First published:

Tags: Crime news, Kerala

ఉత్తమ కథలు